భర్త గొంతు కోసి చంపిన భార్య
వనపర్తి జిల్లాలో దారుణం జరిగింది. తాళి కట్టిన భర్తనే కడతేర్చింది ఓ భార్య. అనుమానంతో నిత్యం వేధిస్తున్న భర్తను దారుణంగా హత్య చేసింది.

వనపర్తి జిల్లాలో దారుణం జరిగింది. తాళి కట్టిన భర్తనే కడతేర్చింది ఓ భార్య. అనుమానంతో నిత్యం వేధిస్తున్న భర్తను దారుణంగా హత్య చేసింది. ఇందులో వారి కూతురు ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వనపర్తి జిల్లా పెద్దమందండి మండలం స్కూల్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని పుల్యాతండాకు చెందిన మెగావత్ బాల్య నాయక్, భార్య మణెమ్మతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తుండగా లాక్‌డౌన్‌తో పనిలేక దంపతులిద్దరూ సొంత తండాకు చేరుకున్నారు. భార్యపై నిత్యం అనుమానంతో వేధించడం మొదలుపెట్టాడు భర్త బాల్య నాయక్. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య చిన్న గొడవ ఒకరిపై మరోకరు దాడి చేసుకునేదాక వెళ్లింది. దీంతో విసుగు చెందిన భార్య మణెమ్మ ఇంట్లో నిద్రిస్తున్న భర్త బాల్య నాయక్ గొంతు కోసి హత్య చేసిందని పోలీసులు తెలిపారు. హత్యకు వారి కూతురు కూడా సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
