ఎర్రగా మారిన లోనార్ క్రేటర్ సరస్సు.. రీజన్ ఏంటంటే..
లోనార్.. మహారాష్ట్రలోని ఒక అద్భుత సైట్ సీయింగ్ ప్రదేశం. విదర్భ ప్రాంతంలోని బుల్దానా జిల్లాలో ఉంది. మంచు యుగంలో భూమి ఉపరితలాన్ని తాకిన ఉల్కాపాతం వల్ల ఈ సరస్సు ఏర్పడింది. అయితే.. లోనార్ క్రేటర్ సరస్సు ఎరుపు రంగులోకి మారింది.

లోనార్.. మహారాష్ట్రలోని ఒక అద్భుత సైట్ సీయింగ్ ప్రదేశం. విదర్భ ప్రాంతంలోని బుల్దానా జిల్లాలో ఉంది. మంచు యుగంలో భూమి ఉపరితలాన్ని తాకిన ఉల్కాపాతం వల్ల ఈ సరస్సు ఏర్పడింది. అయితే.. లోనార్ క్రేటర్ సరస్సు ఎరుపు రంగులోకి మారింది. ఇలా ఎందుకు జరిగింది? ఎరుపు రంగు రావడానికి గల కారణమేంటనే అనేక సందేహాలు స్థానికుల నుంచి ప్రభుత్వ పెద్ద వరకు లేవనెత్తాయి. అయితే ఎవరి దగ్గరా సరైన సమాధానం లేదు. అడవిలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.
ఈ సంఘటనపై లోనార్ మండల తహసీల్దార్ సైఫాన్ నదాఫ్ స్పందించారు. ‘‘గత రెండు-మూడు రోజులుగా ఈ విషయాన్ని మేము కూడా గ్రహించాం. ఈ సమాచారాన్ని అటవీ అధికారులకు చేరవేశాం. సరస్సులోని నీరు ఎరుపు రంగులోకి మారడానికి గల కారణాలు వారు విశ్లేషించి చెప్పే వరకు మనం ఎదురు చూడాలి. దీనికి సబంధించి సరస్సు నుంచి శాంపిల్ కూడా తీసుకెళ్లారు’’ అని నదాఫ్ అన్నారు.