కరోనాకు హాట్ స్పాట్ గా మారిన తిరువనంతపురం ఫిష్ మార్కెట్..!

ప్రకృతి సిటిగా గుర్తింపుపొందిన కేరళలో కరోనా వికృత క్రీడ మొదలు పెట్టింది. కరోనా మహమ్మారికి ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా విస్తరిస్తోంది. నిన్నటి వరకూ తక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా ఉన్న కేరళపై కరోనా పంజా విసురుతోంది. వైరస్ తగ్గుముఖం పడుతుందని భావించిన కేరళలో కరోనా వ్యాప్తి చెందడం పట్ల అధికారులు ఖంగుతింటున్నారు.

కరోనాకు హాట్ స్పాట్ గా మారిన తిరువనంతపురం ఫిష్ మార్కెట్..!
Follow us
Balaraju Goud

| Edited By:

Updated on: Oct 18, 2020 | 8:37 PM

ప్రకృతి సిటిగా గుర్తింపుపొందిన కేరళలో కరోనా వికృత క్రీడ మొదలు పెట్టింది. కరోనా మహమ్మారికి ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా విస్తరిస్తోంది. నిన్నటి వరకూ తక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా ఉన్న కేరళపై కరోనా పంజా విసురుతోంది. వైరస్ తగ్గుముఖం పడుతుందని భావించిన కేరళలో కరోనా వ్యాప్తి చెందడం పట్ల అధికారులు ఖంగుతింటున్నారు.

ప్రకృతి వైద్యానికి దేశంలోనే ఎక్కడా లేని గుర్తింపు కేరళ రాష్ట్రానికి ఉంది. ఇలాంటి కేరళ రాష్ట్రంలో మొన్నటి వరకు కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య చాలా పరిమిత సంఖ్యలో నమోదయ్యాయి. కరోనా రహిత రాష్ట్రంగా ముద్ర కూడా వేసుకుంది. సరిగ్గా ఇదే సమయంలో ఉన్నట్టుండి కేరళ రాష్ట్రం మీద కరోనా వైరస్ పంజా విసిరినట్టు తెలుస్తోంది.

కేరళలో కరోనా వైరస్‌ మరోసారిగా విరుచుకుపడింది. ఇప్పటివరకు గల్ఫ్‌ దేశాల నుంచి కేరళకు వచ్చిన వారి నుంచి కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా తిరువనంతపురంలో మరో 57 కరోనా పాజిటివ్‌ కేసులు నవెూదు కావడం ప్ర‌జ‌ల‌ను, ప్ర‌భుత్వాన్ని క‌ల‌వ‌ర పెడుతోంది. ముఖ్యంగా తిరువనంతపురం అత్యధిక కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు 87 శాతం కేసులు చేపల మార్కెట్ లోనే నమోదయ్యాయన్నారు. పెరుగుతున్న కేసులను చూస్తుంటే భయాందోళనలు కలుగుతున్నాయి. అంబలతారలోని కుమరిచంత ఫిష్ మార్కెట్ ఇప్పుడు ఇన్ఫెక్షన్ కు కేంద్రంగా మారింది. మంగళవారం ప్రకటించిన కేసుల్లో కనీసం 25 కేసులు తీరప్రాంతంలో మార్కెట్‌తో ముడిపడి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గత ఏడు రోజులలో జిల్లాలో దాదాపు 60 పాజిటివ్ కేసులు మార్కెట్‌కు సంబంధం ఉన్నవారికే సోకడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇందులో చేపల వ్యాపారులతో పాటు , ఆరోగ్య కార్యకర్తలు సైతం కరోనా బారినపడుతున్నారు.

తిరువనంతపురం తీర ప్రాంతాలైన మణికవిలకోమ్, పుతేన్‌పల్లి, అంబలతారా, పూంతురా ప్రాంతాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. చేపల క్రయవిక్రయాలకు వందలాది మంది గుమిగూడడం, చేపల ట్రక్కులు ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగిండంతో కరోనా కేసులు పెరుగుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇదే క్రమంలో కన్యాకుమారికి వెళ్లే పుతేన్‌పల్లి చేపల వ్యాపారి ఒకరు కరోనాతో మరిణించడం ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది. దీంతో అతని నుంచి మార్కెట్ లోని ఇతర వ్యాపారులకు కూడా సంక్రమించిందని అధికారులు భావిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పోయే వారిలోనే ఎక్కువ లక్షణాలు కనిపిస్తున్నాయని అధికారులు అంటున్నారు. అన్ లాక్ అనంతరం తిరిగి తెరుచుకున్న మార్కెట్ ద్వారా జన సమూహాం పెరిగడంతో కరోనా వైరస్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.