ఆర్డీసీ మాజీ ఎండీ సురేంద్రబాబు సడన్ బదిలీ: అసలు కథేంటి..?

ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు‌ను ఆకస్మికంగా బదిలీ చేసింది జగన్ ప్రభుత్వం. ఒక పక్క ఆర్టీసీని.. ప్రభుత్వంలో.. విలీనం చేస్తున్న నేపథ్యంలో.. ఏపీ గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. 1987 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన సురేంద్రబాబుకు పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. సురేంద్రబాబు ప్లేస్‌లో.. నూతన ఆర్టీసీ ఎండీగా రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఎమ్‌టీ కృష్ణబాబును ప్రభుత్వం నియమించింది. చేనేత జౌళి శాఖ కార్యదర్శిగా […]

ఆర్డీసీ మాజీ ఎండీ సురేంద్రబాబు సడన్ బదిలీ: అసలు కథేంటి..?
Follow us

| Edited By:

Updated on: Sep 26, 2019 | 6:51 PM

ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు‌ను ఆకస్మికంగా బదిలీ చేసింది జగన్ ప్రభుత్వం. ఒక పక్క ఆర్టీసీని.. ప్రభుత్వంలో.. విలీనం చేస్తున్న నేపథ్యంలో.. ఏపీ గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. 1987 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన సురేంద్రబాబుకు పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. సురేంద్రబాబు ప్లేస్‌లో.. నూతన ఆర్టీసీ ఎండీగా రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఎమ్‌టీ కృష్ణబాబును ప్రభుత్వం నియమించింది. చేనేత జౌళి శాఖ కార్యదర్శిగా సీఎం కార్యాలయ కార్యదర్శి జే మురళికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకూ ఉన్న సురేంద్ర బాబును బదిలీ చేస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబును మార్చుతూ.. జగన్ ప్రభుత్వం సడన్‌ షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా ఆయన్ని బదిలీ చేయడానికి కారణాలేంటని..? అందరూ ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఆర్టీసీని.. ప్రభుత్వంలో విలీనం చేయాలనుకుంటున్నారు. ఈ సమయంలో.. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో.. అటు ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య ఏపీలో డీజీపీల పోస్టులను బదిలీలు చేస్తూ.. జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే.. కేంద్రంతో పట్టుబట్టి మరీ.. డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఏపీకి తీసుకొచ్చారు. అయితే.. వారికి అనుకూలమైన వారినే ఆంధ్రప్రదేశ్‌కి తీసుకుంటున్నారని.. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కూడా. కానీ.. అనుకోని విధంగా.. ఏపీ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబును మార్చడం మాత్రం.. అందరినీ కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంత సడన్‌గా ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారని.. పలు ప్రశ్నలు ఎదురవుతోన్నాయి.

కాగా.. సురేంద్ర బాబు చేసిన తప్పులే.. ఆయన బదిలీకి కారణమని అని కూడా అంటున్నారు. ప్రభుత్వ ఇమేజ్‌ను డ్యామెజ్ చేసేలా ఆయన వ్యవహరిస్తున్నారని.. అలాగే.. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినప్పుడు.. ఆర్టీసీ సమ్మె కార్మికులను ఆయనే రెచ్చగొట్టారనే పలు వార్తలు షికారు చేస్తున్నాయి. దానిపై ఏపీలో పెద్ద రచ్చ నే జరిగింది. అన్నింటికంటే.. మరో ముఖ్యమైన విషయమేంటంటే.. తిరుమలకు వెళ్లే బస్‌ టికెట్లపై అన్యమత ప్రచారం వ్యవహరం. ఈ ఘటనతో వైసీపీ ప్రభుత్వం పలు ఆరోపణలు ఎదుర్కోవలసి వచ్చింది. దీనిపై సీఎం జగన్ ‌కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ.. దీనిపై సురేంద్రబాబు మాత్రం స్పందించలేదు. ఈ విషయాలన్నింటిపై.. జగన్.. సురేంద్రపై సీరియస్‌గా ఉన్నట్టు అందుకే ఆయన్ని ట్రాన్స్‌ఫర్ చేశారని తెలుస్తోంది.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..