కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప-ఎన్నిక వాయిదా!

కర్నాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు గానూ వచ్చే నెలలో జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేయనున్నట్టు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పేర్కొంది. రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో ఈసీ ఈ మేరకు వెల్లడించింది. అనర్హత వేటును సవాల్ చేస్తూ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కర్ణాటకలోని కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన రెబల్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ అనర్హత వేటు వేసిన […]

కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప-ఎన్నిక వాయిదా!
Follow us

| Edited By:

Updated on: Sep 26, 2019 | 7:00 PM

కర్నాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు గానూ వచ్చే నెలలో జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేయనున్నట్టు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పేర్కొంది. రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో ఈసీ ఈ మేరకు వెల్లడించింది. అనర్హత వేటును సవాల్ చేస్తూ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కర్ణాటకలోని కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన రెబల్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు సుప్రీం కోర్టు తలుపుతట్టారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 22కు వాయిదా పడింది.

వాస్తవానికి మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు కర్నాటక ఉపఎన్నికలను కూడా ఒకే దశలో నిర్వహించేందుకు ఈసీ ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో అక్టోబర్ 21 జరిగే ఉపఎన్నికలపై స్టే విధించాలని లేదా తమను ఈ ఎన్నికల్లో పోటీచేసేందుకు అనుమతించాలని కోరుతూ అనర్హతకు గురైన కర్నాటక ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత విధించడం వంటి అంశాలపై ఎలా వ్యవహరించాలన్న దానిపై మార్గదర్శకాలు ఇవ్వాలంటూ కర్నాటక స్పీకర్ సుప్రీంకోర్టును కోరారు.