కరోనాపై పోరాటానికి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. సోషల్‌ మీడియా ఉద్యమం

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గురువారం (మార్చి 5) కొత్త సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కరోనావైరస్ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ "బీ రెడీ ఫర్ కోవిడ్ -19" అనే కొత్త సోషల్ మీడియా ప్రచారానికి

కరోనాపై పోరాటానికి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. సోషల్‌ మీడియా ఉద్యమం
Follow us

| Edited By:

Updated on: Mar 06, 2020 | 5:10 PM

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గురువారం (మార్చి 5) కొత్త సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కరోనావైరస్ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ “బీ రెడీ ఫర్ కోవిడ్ -19″ అనే కొత్త సోషల్ మీడియా ప్రచారానికి శ్రీకారం చుట్టింది.

డబ్ల్యుహెచ్‌ఓ డైరక్టర్‌ జనరల్ జనరల్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ గెబ్రెసస్‌ మాట్లాడుతూ.. ”కరోనా విషయంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని మాకు తెలుసు. అది సహజం.. అయితే సరైన సమాచారాన్ని అందించటం ద్వారా వారి భయాన్ని తొలగించొచ్చు. ప్రమాదాన్ని తగ్గించొచ్చు. ఈ లక్ష్యంతోనే మేము ”బీ రెడీ ఫర్‌ కొవిడ్‌-19”ను మొదలుపెట్టాము.” అని ప్రకటించారు.

నిర్లక్ష్యం చేయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో వైరస్ కు అడ్డుకట్ట వేయాలని ప్రపంచదేశాలకు సూచించింది.’ప్రపంచంలో 90 దేశాల్లో కరోనా ఉన్న మాట నిజమే .. కానీ 115 దేశాల్లో ఈ వ్యాధి లేదనే విషయాన్ని కూడా మనం గమనించాలి. కరోనా ఉన్న వాటిల్లో 21 దేశాల్లో కేవలం ఒక్కో కేసు మాత్రమే నమోదైంది.

మరోవైపు.. ఐదు దేశాల్లో గత 14 రోజుల నుంచి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇది అంతం లేని పోరాటం కాదు. ఈ ప్రమాదాన్ని మనం తగ్గించగలం.. కానీ అది మనందరి సమష్టి కృషి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఇందుకు ప్రతి దేశం త్వరితంగా, కృత నిశ్చయంతో నడుచుకోవాలి’ అని గెబ్రెసస్‌ సూచించారు.