అమెరికా ఎన్నికల తేదీపై వైట్‌హౌస్ క్లారిటీ
ఎట్టకేలకు అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల తేదీ ఖరారైంది. నవంబర్ మూడో తేదీనే అధ్యక్ష ఎన్నికలు జరగుతాయని వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్ స్పష్టం చేశారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మెయిల్-ఇన్ ఓటింగ్ ద్వారా ఓటర్ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉందంటూ ఎన్నికలను వాయిదా వేయాలని సూచించారు.
ఎట్టకేలకు అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల తేదీ ఖరారైంది. నవంబర్ మూడో తేదీనే అధ్యక్ష ఎన్నికలు జరగుతాయని వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్ స్పష్టం చేశారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మెయిల్-ఇన్ ఓటింగ్ ద్వారా ఓటర్ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉందంటూ ఎన్నికలను వాయిదా వేయాలని సూచించారు. అయితే, ట్రంప్ మాటలను అటు డెమొక్రట్లతో పాటు సొంత పార్టీ నేతలు సైతం తప్పుపట్టారు. ట్రంప్ ఎన్నికల ప్రక్రియలో తల దూర్చుతున్నారన్న వ్యాఖ్యలను మార్క్ మెడోస్ ఖండించారు. ట్రంప్ కేవలం ఇంటి నుంచే ఓటు వేయడం పద్దతి ద్వారా ఫలితాలు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంటుందని మాత్రమే ఆందోళన వ్యక్తం చేశారన్నారు. అంతేతప్ప ఎన్నికలను వాయిదా వేయాలని ట్రంప్ ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదన్నారు. అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు నవంబర్ మూడో తేదీన యథావిధిగా జరగనున్నాయని.. ట్రంప్ మరోమారు అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నారని మార్క్ మెడోస్ అభిప్రాయపడ్డారు. కాగా, అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ బరిలో నిలవగా.. డెమొక్రటిక్ పార్టీ నుంచి జో బైడెన్ తలపడుతున్నారు.