ఇవాళ బాధ్యతలు చేపట్టనున్న నిమ్మగడ్డ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 11.15 గంటలకు ఆయన బాధ్యతలు చేపడతారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 11.15 గంటలకు ఆయన బాధ్యతలు చేపడతారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను పునర్నియమిస్తూ ఇటీవల పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేదీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన్ను తిరిగి నియమిస్తున్నట్టు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ఒక ప్రకటనను విడుదల చేశారు. ఎన్నికల కమిషనర్‌గా రమేశ్ కుమార్ నియామకానికి సంబంధించి గెజిట్ విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. నాటకీయ పరిణామాల నడుమ ఎస్ఈసీ కమిషనర్ గా తొలగించబడ్డ రమేష్ కుమార్ కోర్టు ఆదేశాల మేరకు తిరిగి బాధ్యతలు చేపడుతున్నారు.