భర్త చేసిన అప్పు తీర్చలేదని.. భార్య కిడ్నాప్
తీసుకున్న అప్పు తీర్చలేదని ఓ నీచుడు దారుణానికి ఒడిగట్టాడు. భర్త ముందే భార్యను కిడ్నాప్ చేశాడు. దీంతో భార్యను విడిపించాలంటూ బాధితుడు పోలీసులను అశ్రయించాడు.
తీసుకున్న అప్పు తీర్చలేదని ఓ నీచుడు దారుణానికి ఒడిగట్టాడు. భర్త ముందే భార్యను కిడ్నాప్ చేశాడు. దీంతో భార్యను విడిపించాలంటూ బాధితుడు పోలీసులను అశ్రయించాడు. పశ్చిమ బెంగాల్ లోని బీర్బూం జిల్లాలో సోహన్ అనే వ్యక్తి.. అదే గ్రామానికి చెందిన లడ్డూ అనే వ్యక్తి వద్ద రూ. 2 లక్షలు అప్పు తీసుకున్నాడు. అయితే, తీసుకున్న 2 లక్షలలో ఈ మధ్యనే ఒక లక్ష రూపాయలు తిరిగి చెల్లించేశాడు. మిగిలిన డబ్బు త్వరలోనే చెల్లిస్తానని లడ్డూకు చెప్పాడు. అయితే, అనుకున్న సమయానికి డబ్బు రాకపోవడంతో మిగిలిన రూ.లక్షతో పాటు వడ్డీ చెల్లించలేకపోయాడు. డబ్బులు తిరిగి చెల్లించేందుకు ఇంకొంత గడువును కోరాడు సోహన్. అందుకు ఒప్పుకోని వ్యాపారి లడ్డూ తన డబ్బులు తనకు వెంటనే చెల్లించాలని గొడవకు దిగాడు. అంతేకాదు, సోహన్ ఇంటికి వెళ్లి అతడి భార్యను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశాడు. ఆమె పై దాడికి పాల్పడ్డాడు. బాధితురాలిని తన ఇంటికి లాక్కెళ్లి బంధించాడు. తన డబ్బు చెల్లించి భార్యను విడిపించుకొని పోవాలని లడ్డూ తెగేసి చెప్పాడు. దీంతో సోహన్ చేసేదేమి లేక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.