Comedian Kapil Sharma: వీల్ చైర్‌లో పాపులర్ కమెడియన్ కపిల్ శర్మ, ఫొటోగ్రాఫర్లపై చిందులు, వీడియో వైరల్.

Comedian Kapil Sharma:ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ ముంబై విమానాశ్రయంలో కొందరు ఫొటోగ్రాఫర్లపై దురుసుగా మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. 'పక్కకు జరుగు..ఉల్లూకా.

Comedian Kapil Sharma: వీల్ చైర్‌లో పాపులర్  కమెడియన్ కపిల్ శర్మ, ఫొటోగ్రాఫర్లపై చిందులు, వీడియో వైరల్.
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 23, 2021 | 7:18 PM

Comedian Kapil Sharma:ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ ముంబై విమానాశ్రయంలో కొందరు ఫొటోగ్రాఫర్లపై దురుసుగా మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. ‘పక్కకు జరుగు..ఉల్లూకా..’ అంటూ అతడు అరిచినంత పని చేశాడు. ఎయిర్ పోర్టు సిబ్బందిలో ఒకరు తనను వీల్ చైర్ లో తీసుకువస్తుండగా కొంతమంది ఫొటోగ్రాఫర్లు వెంటబడుతూ అతని ఫోటో తీసేందుకు యత్నించారు. ఇందుకు  వారిపై కపిల్ శర్మ చిరాకు పడ్డాడు. పక్కకు జరుగుతావా లేదా అని కేక పెట్టాడు.అసలే తను ఈ  స్థితిలో ఉంటే ఫోటోలు తీస్తారా అని ఆగ్రహించాడు. అసలు ఇంతకీ ఇతడు వీల్ చైర్ లో ఎందుకు కూర్చున్నాడంటే.. జిమ్ లో వర్క్ చేస్తుండగా ఒక్కసారిగా వెన్నుకు గాయమైందట.. అందువల్లే చికిత్స పొంది వీల్ చైర్ ను ఆశ్రయించాడట..

కపిల్ శర్మ భార్య  గిన్ని ఛత్రాల ఈ మధ్యే ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కపిల్ ‘పెటర్నిటీ లీవ్’ లో ఉన్నాడు. ఈ కారణంగా టీవీలో ఇతని ‘కపిల్ శర్మ షో’ వాయిదా పడింది. త్వరలో  మళ్ళీ ఈ షో ను ప్రారంభిస్తానని చెబుతున్నాడు.

Also Read:

దూసుకోస్తోన్న కరోనా సెకండ్ వేవ్, 16 రాష్ట్రాల్లో డేంజర్‌ బెల్స్‌.. కరీంనగర్‌ 36 ప్లస్‌.. పశ్చిమగోదావరిలోనూ అలజడి

India vs England: పింక్ బాల్ మ్యాచ్‌పై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు..