నేడే పోలింగ్.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం

దేశ రాజధాని ఢిల్లీలో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. మరి కొద్ది గంటల్లో అసెంబ్లీ ఎలక్షన్స్‌ జరగనున్నాయి. 70 స్థానాలకు ఒకే విడతలో జరగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈసీ. 13వేల 750 కేంద్రాల్లో ఓటింగ్‌కు సన్నాహాలు చేశారు అధికారులు. 380 పోలింగ్ కేంద్రాలను మహిళలు, 11సెంటర్లను దివ్యాంగులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈవీఎంలు, సిబ్బందిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. ఫిబ్రవరి 11న ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొత్తం 70 నియోజకవర్గాలకు గానూ […]

నేడే పోలింగ్.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం
Follow us

| Edited By: Srinu

Updated on: Feb 08, 2020 | 3:38 PM

దేశ రాజధాని ఢిల్లీలో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. మరి కొద్ది గంటల్లో అసెంబ్లీ ఎలక్షన్స్‌ జరగనున్నాయి. 70 స్థానాలకు ఒకే విడతలో జరగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈసీ. 13వేల 750 కేంద్రాల్లో ఓటింగ్‌కు సన్నాహాలు చేశారు అధికారులు. 380 పోలింగ్ కేంద్రాలను మహిళలు, 11సెంటర్లను దివ్యాంగులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈవీఎంలు, సిబ్బందిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. ఫిబ్రవరి 11న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

మొత్తం 70 నియోజకవర్గాలకు గానూ 672మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కోటీ 47 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 80లక్షల మందికి పైగా పురుషులు, 60 లక్షల మందికి పైగా మహిళలు ఓటు వేయనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ప్రజలు పెద్ద ఎత్తున ఓటుహక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు అధికారులు. మెడికల్‌ కిట్స్‌, వికలాంగులు, వృద్ధుల కోసం స్పెషల్ అరేంజ్‌మెంట్స్‌ చేశారు.

షహీన్‌ బాగ్‌ సహా పలు ప్రాంతాల్లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలతో అప్రమత్తమయ్యారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. 90వేల మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. 190 కంపెనీల కేంద్ర బలగాలు, 42వేల మంది స్థానిక పోలీసులు, 19వేల మంది హోంగార్డులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కంటే ఇప్పుడు దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా బలగాలను మోహరించారు.

అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ ఒంటరిగా బరిలోకి దిగగా..బీజేపీ జేడీయూ, లోక్‌జన్‌శక్తి పార్టీతో కలిసి పోటీ చేస్తోంది. ఆప్‌, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. మూడు పార్టీలు ఎవరికి వారే విజయంపై ధీమాగా ఉన్నాయి. గత ఐదేళ్లుగా అమలుచేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయనే నమ్మకంతో ఉంది ఆప్‌. ఇక ఇటీవల జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో 7 స్థానాలనూ కైవసం చేసుకున్న బీజేపీ..ఈసారి కూడా తమను ఆదరిస్తారనే ఆశతో ఉంది. మరోవైపు ఢిల్లీని వరుసగా మూడుసార్లు ఏలి 2013లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ పూర్వ వైభవం కోసం ఎదురుచూస్తోంది.