భోజనం తర్వాత ఇలా ఓ పాన్ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే తీసుకోకుండా ఉండలేరు..
తమలపాకులు అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఆధ్మాత్మిక భావన. కానీ, తమలపాకుతో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా..? పురాతన కాలంనుంచి ఆయుర్వేద ఔషధాల్లో తమలపాకుల పాత్ర ఉంది. సరిగ్గా తీసుకుంటే..అది మీ శరీరానికి బహుళ ప్రయోజనాలను అందిస్తుందని అనేక అధ్యయనాలు నిరూపించాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.

చాలా మందికి భోజనం తర్వాత తమలపాకు పాన్ తినే అలవాటు ఉంటుంది. ఇది నోటిని తాజాగా ఉంచుతుంది. నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. అంతేకాదు..తమలపాకు పాన్ తినటం వల్ల మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని మీకు తెలుసా? తమలపాకును సరైన పద్ధతిలో తీసుకుంటే, అది మీ శరీరానికి బహుళ ప్రయోజనాలను అందించగలదని అనేక అధ్యయనాలు నిరూపించాయి. వాటి గురించి తెలుసుకుందాం.
తమలపాకు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు :
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది- ఒక అధ్యయనం ప్రకారం భోజనం తర్వాత తమలపాకును నమలడం వల్ల లాలాజలం, గ్యాస్ట్రిక్ రసాల స్రావం పెరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. బరువు, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇది ప్రత్యేకంగా కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది.
నోటి బాక్టీరియాను తొలగిస్తుంది – నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ పరిశోధన నివేదిక ప్రకారం, తమలపాకులలో ఉండే యూజినాల్, హైడ్రాక్సీచావికాల్ వంటి సహజ సమ్మేళనాలు నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. ఇది దుర్వాసన, కావిటీస్, చిగుళ్ల సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
వాపు, నొప్పి నుండి ఉపశమనం- తమలపాకు శరీరంలోని వాపును తగ్గించేందుకు సహాయపడుతుంది. దీని ప్రభావం నొప్పి నివారణ మందుల మాదిరిగానే పనిచేస్తుంది. ఇది తేలికపాటి మంట, చికాకు నుండి ఉపశమనం కలిగిస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి – నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ నుండి వచ్చిన మరో నివేదిక ప్రకారం, తమలపాకులో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయని, ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయని పేర్కొంది. ఇది కణాలను రక్షిస్తుంది. వయస్సు సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది- వీటన్నింటికీ మించి, తమలపాకు రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నతను నెమ్మదిస్తుంది. చక్కెర స్థాయిలలో ఆకస్మిక పెరుగుదలను నివారిస్తుంది. అందువల్ల, డయాబెటిక్ రోగులు భోజనం తర్వాత తమలపాకును నమలడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలలో ఆకస్మిక పెరుగుదలను నివారించవచ్చు. చక్కెర క్రమంగా శరీరంలోకి విడుదల అవుతుంది.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
ఒక రోజులో ఎన్ని తమలపాకులు తినాలి?:
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు ఒకటి నుండి రెండు సాదా తమలపాకులు సరిపోతాయి. తమలపాకులతో పొగాకు లేదా తీపి పాన్ మసాలా వంటివి కలిపి తినకుండా ఉండాలి. సాదా తమలపాకులను మాత్రమే తినండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








