బెంగాల్ లో 42 వేలు దాటిన కరోనా కేసులు

బెంగాల్‌లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇవాళ ఒక్కరోజే రికార్డుస్థాయిలో 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా 1500కు అటుఇటుగా నమోదవుతున్న కేసులు నేడు ఏకంగా 2,200 దాటేశాయి.

బెంగాల్ లో 42 వేలు దాటిన కరోనా కేసులు
Follow us

|

Updated on: Jul 19, 2020 | 9:24 PM

బెంగాల్‌లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇవాళ ఒక్కరోజే రికార్డుస్థాయిలో 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా 1500కు అటుఇటుగా నమోదవుతున్న కేసులు నేడు ఏకంగా 2,200 దాటేశాయి. దీనికి తోడు మరణాలు సంఖ్య కూడా పెరిగింది. కొత్తగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 2,278 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 42,487కు చేరింది. ఇవాళ ఒక్కరోజే 36 మంది కరోనా బారినపడి మరణించారు. కాగా ఇప్పటివరకు మొత్తం 1,112మంది మృత్యువాతపడ్డారు. ఆదివారం 1,344మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని వీరిలో 16,492మంది చికిత్స పొందుతుండగా 24,883మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.