వడగాల్పుల డేంజర్: వాతావరణ శాఖ హెచ్చరిక
దేశవ్యాప్తంగా భానుడి ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు, రేపు ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సోమ, మంగళవారాల్లో 45 నుంచి 47డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని.. వడగాలులు తీవ్రం అవుతాయని వాతావరణ శాఖ తెలిపినట్లు కడప కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండలో బయటకు రావొద్దని […]
దేశవ్యాప్తంగా భానుడి ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు, రేపు ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సోమ, మంగళవారాల్లో 45 నుంచి 47డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని.. వడగాలులు తీవ్రం అవుతాయని వాతావరణ శాఖ తెలిపినట్లు కడప కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండలో బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల పదో తేదీ వరకు ఎండల తీవ్రత ఇలానే ఉంటుందని.. తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే వడదెబ్బకు గురికాకుండా తగుజాగ్రత్తలు పాటించాలని సూచించారు.