AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ములుగుజిల్లాలో ఎన్‌కౌంటర్.. రాత్రికి రాత్రే పోస్ట్‌మార్టమ్

వరంగల్ ములుగు జిల్లా మంగపేట మండలం నర్సింహాసాగర్ సమీప అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగింది. నిన్న (ఆదివారం) సాయంత్రం ముసలమ్మగుట్ట దగ్గర జరిగిన ఈ ఎన్ కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతులు ఇద్దరూ పురుషులు. మృతదేహాలను రాత్రికి రాత్రే పోస్టుమార్టం నిమిత్తం ములుగు జిల్లా ఆస్పత్రి మార్చురీకి పోలీసులు తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీస్ బలగాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు కాబట్టే ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపాం అని […]

ములుగుజిల్లాలో ఎన్‌కౌంటర్.. రాత్రికి రాత్రే పోస్ట్‌మార్టమ్
Venkata Narayana
|

Updated on: Oct 19, 2020 | 7:01 AM

Share

వరంగల్ ములుగు జిల్లా మంగపేట మండలం నర్సింహాసాగర్ సమీప అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగింది. నిన్న (ఆదివారం) సాయంత్రం ముసలమ్మగుట్ట దగ్గర జరిగిన ఈ ఎన్ కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతులు ఇద్దరూ పురుషులు. మృతదేహాలను రాత్రికి రాత్రే పోస్టుమార్టం నిమిత్తం ములుగు జిల్లా ఆస్పత్రి మార్చురీకి పోలీసులు తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీస్ బలగాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు కాబట్టే ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపాం అని జిల్లా ఎస్పీ చెబుతున్నారు.

Follow Us