హనుమకొండ జిల్లాలో గూగుల్ మ్యాప్ నిర్లక్ష్యం కారణంగా ఓ కంటైనర్ డ్రైవర్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా, గూగుల్ మ్యాప్స్ చూపిన మార్గంలో నిర్మాణంలో ఉన్న ఆర్ఓబీపైకి కంటైనర్ దూసుకెళ్లింది. సరైన హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో డ్రైవర్ గమనించలేదు. చివరి నిమిషంలో అప్రమత్తమై వాహనాన్ని ఆపడంతో భారీ ప్రమాదం తప్పింది.