అనకాపల్లి జిల్లా నాతవరం మండలం శృంగవరంలో జరిగిన ఒక పెళ్లి వేడుకలో ఐదు లక్షల రూపాయల నగదు, బంగారం ఉన్న బ్యాగ్‌ను దొంగ దొంగిలించాడు. నిద్రమత్తులో ఉన్న పెళ్లివారి బంధువు నుంచి బ్యాగ్‌ను లాక్కుని, గడ్డివాములో దాచాడు. అయితే, 112కు సమాచారం అందగానే పోలీసులు తక్షణమే స్పందించి గంటల వ్యవధిలోనే దొంగను, దొంగిలించిన సొమ్మును పట్టుకున్నారు.