AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ్యాచ్‌కి ముందే గుండెలు పిండేసిన వైభవ్ సూర్యవంశీ! వెరీ ఎమోషనల్ సీన్స్..

వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వయసులో టీమిండియా తరఫున అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించనున్నాడు. ఇంగ్లాండ్‌తో రెండో టీ20 కోసం ఎంపికైన వైభవ్, అతి చిన్న వయసులో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం పట్ల భావోద్వేగానికి గురయ్యాడు. తిలక్ వర్మ చేతుల మీదుగా క్యాప్ అందుకున్న ఈ వండర్ కిడ్, భారత క్రికెట్ భవిష్యత్తుకు ఆశాకిరణంగా మారనున్నాడు.

మ్యాచ్‌కి ముందే గుండెలు పిండేసిన వైభవ్ సూర్యవంశీ! వెరీ ఎమోషనల్ సీన్స్..
Vaibhav Sooryavanshi Got Em
SN Pasha
|

Updated on: Jul 04, 2026 | 6:51 PM

Share

టీమిండియా వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు డెబ్యూ చేయబోతున్నాడు. ఇంగ్లాండ్‌తో రెండో టీ20 కోసం వైభవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకున్నారు. దీంతో టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తున్న అతి చిన్న వయస్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించబోతున్నాడు. మ్యాచ్‌కి ముందు జరిగిన టీమ్ హుడిల్‌లో వైభవ్ సూర్యవంశీకి మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ క్యాప్ అందించాడు. దీంతో మిగతా క్రికెటర్లంతా వైభవ్‌ను అభినందనలతో ముంచెత్తారు.

తొలి సారి టీమిండియా తరఫున ఆడుతున్న ఫీలింగ్‌ను వైభవ్ మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు. అయితే పిల్లాడు కదా పాపం.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎంత టీమిండియాకు ఆడుతున్నా.. వయసులో చిన్నోడే కనుక ఆ ఎమోషనల్ ఫీలింగ్స్‌ను కన్నీళ్ల రూపంలో చూపించాడు. నిజానికి వైభవ్ కన్నీళ్లు పెట్టుకోవడంతో కొత్త కాదు.. ఐపీఎల్ ఆడుతూ.. పెద్ద స్కోర్లను సెంచరీగా మార్చలేకపోయిన ప్రతీ సారి వైభవ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఇప్పుడు టీమిండియాకు ఆడే అవకాశం వస్తుందనే విషయం తెలిసి మరోసారి చాలా ఎమోషనల్ అయ్యాడు. దేశానికి ప్రతినిధ్యం వహించడం చాలా పెద్ద విషయం అనే సంగతి తెలిసిందే. ఎన్నో లక్షల మంది యువకులు అందుకోసం కలలు కంటుంటారు. కానీ, వైభవ్ దాన్ని కేవలం 15 ఏళ్ల వయసులోనే సాధించాడు. పదో తరగతి చదువుతూ పుస్తకాలతో కుస్తీ పట్టే వయసులోనే 140 కోట్ల మంది భారతీయల ఆశలు మోసే స్థాయికి ఎదిగిపోయాడు. ఫైనల్‌గా.. వైభవ్ సూర్యవంశీకి ఆల్ ది బెస్ట్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అందుకే రా పాకిస్తాన్ టీం అనేది.. క్యాచ్ వదిలేసి గొడవపడ్డ ఆటగాళ్లు
అందుకే రా పాకిస్తాన్ టీం అనేది.. క్యాచ్ వదిలేసి గొడవపడ్డ ఆటగాళ్లు
నో మొబైల్‌.. రోజుకు 10 గంటల చదువు.. UPSC టాపర్ సక్సెస్ స్టోరీ!
నో మొబైల్‌.. రోజుకు 10 గంటల చదువు.. UPSC టాపర్ సక్సెస్ స్టోరీ!
పాత బోగీలు, ఇంజిన్లను రైల్వేశాఖ ఏం చేస్తుందో తెలుసా..?
పాత బోగీలు, ఇంజిన్లను రైల్వేశాఖ ఏం చేస్తుందో తెలుసా..?
మటన్ లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
మటన్ లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
ఒకే వయసు.. ఒకే మార్కులు.. కానీ కాలేజీ చదువులో భారీ వ్యత్యాసం..
ఒకే వయసు.. ఒకే మార్కులు.. కానీ కాలేజీ చదువులో భారీ వ్యత్యాసం..
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..