AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pet Care: కుక్కలకు పాలు తాగిస్తున్నారా? అయితే వాటి ప్రాణాలు రిస్క్‌లో ఉన్నట్టే.. ఎందుకో తెలుసా?

మన ఇళ్లలో పెంపుడు జంతువులుగా కుక్కలను (Pet Dogs) కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటారు. ఈ క్రమంలోనే కుక్కలకు పాలు ఇవ్వడం వాటి ఆరోగ్యానికి చాలా మంచిదని , ఎంతో బలాన్ని ఇస్తుందని మనలో చాలా మంది గట్టిగా నమ్ముతుంటారు. అయితే ఈ అలవాటు అన్ని రకాల కుక్కలకు అస్సలు సరిపడదని, కొన్ని కుక్కలలో ఇది తీవ్రమైన ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని పశువైద్యులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.

Pet Care: కుక్కలకు పాలు తాగిస్తున్నారా? అయితే వాటి ప్రాణాలు రిస్క్‌లో ఉన్నట్టే.. ఎందుకో తెలుసా?
Can We Give Milk To Dogs
Bhavani
|

Updated on: Jul 04, 2026 | 6:52 PM

Share

చాలా మంది ఇళ్లలో కుక్కలను పెంచుకోవడం సాధారణంగా మారింది. దానికి సమయానికి ఆహారం పెట్టడం, ఇంజెక్షన్లు వేయడంతో శునకాలు సేఫ్ అని చాలా మంది భావిస్తారు. అయితే పశువైద్య నిపుణుల వివరాల ప్రకారం, మనుషుల లాగే కుక్కల శరీర తత్వం కూడా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మనం ప్రతిరోజూ తాగే పాలు వాటి జీర్ణవ్యవస్థకు ఒక్కోసారి తీవ్రమైన శాపంగా మారే ప్రమాదం ఉందట.

లాక్టోజ్ ఇంటాలరెన్స్ సమస్య పశువైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం… చాలా రకాల కుక్కలు పాలల్లో సహజంగా ఉండే లాక్టోజ్ అనే చక్కెర పదార్థాన్ని అస్సలు జీర్ణం చేసుకోలేవు. ఎందుకంటే వాటి శరీరంలో లాక్టోజ్‌ను విచ్ఛిన్నం చేసే ఎంజైములు తక్కువగా ఉంటాయి. దీనివల్ల కుక్కలకు పాలు తాగించినప్పుడు తీవ్రమైన గ్యాస్, అజీర్ణం, కడుపునొప్పి, విరేచనాలు (మోషన్స్), వాంతులు వంటి జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కొన్ని సున్నితమైన కుక్కలలో దీనివల్ల విపరీతమైన అలర్జీలు , చర్మంపై తీవ్రమైన దురద వంటి సమస్యలు కూడా రావచ్చు.

పాలకు బదులుగా పెరుగు ఇవ్వడం శ్రేయస్కరం కుక్కల జీర్ణవ్యవస్థకు పాలు పడవు కాబట్టి, వాటికి పాలకు బదులుగా తగిన పరిమాణంలో తాజా పెరుగు తినిపించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పెరుగులో ఉండే గుడ్ బ్యాక్టీరియా పాలలో ఉండే లాక్టోజ్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇది కుక్కలు ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసుకోవడానికి , పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సాయడపడుతుంది.

నూనె , మసాలా వంటకాలు కుక్కలను ఎల్లప్పుడూ అధిక నూనె పదార్థాలు, కారంగా ఉండే మసాలా వంటకాలు, ప్యాక్ చేసిన జంక్ ఫుడ్స్ , ప్రిజర్వేటివ్స్ కలిగిన ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉంచాలి. ఇవి కుక్కల కాలేయం , జీర్ణవ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తాయి. వంటల్లో జీర్ణక్రియకు సహాయపడే ఇతర మసాలాలను వాడకూడదు. కేవలం మాంసాహారం వండేటప్పుడు మాత్రమే చాలా తక్కువ పరిమాణంలో యాంటీబయాటిక్‌గా పనిచేసే పసుపును ఉపయోగించవచ్చు.

స్వీట్లు , చక్కెర పదార్థాలు కుక్కలకు చాక్లెట్లు, స్వీట్లు, క్యాండీలు, తీపి బిస్కెట్లు , ఇతర చక్కెర పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఇవి కుక్కలలో విపరీతమైన ఊబకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యల ప్రమాదాన్ని చాలా వేగంగా పెంచుతాయి.

పండ్లు , గింజల ప్రమాదం కుక్కలకు పండ్లను ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మామిడి పండ్ల లాంటి మరీ విపరీతమైన తీపిగా ఉండే పండ్లను ఇవ్వకపోవడమే మంచిది. అలాగే ఏ రకమైన పండునైనా తినిపించే ముందు దానిలో ఉండే గింజలను పూర్తిగా తీసివేయాలి. ఎందుకంటే కొన్ని రకాల పండ్ల గింజలు కుక్కల పొట్టలోకి వెళ్తే అవి తీవ్రమైన విషపూరితంగా మారి ప్రాణాలకే ప్రమాదం తెస్తాయి.

గమనిక: ఈ కథనంలో అందించబడిన పెంపుడు జంతువుల ఆరోగ్య సమాచారం , సూచనలు కేవలం ప్రముఖ పశువైద్య నిపుణుల నివేదికలు , సాధారణ అవగాహన ఆధారంగా సేకరించబడినది మాత్రమే. ఇది వృత్తిపరమైన వెటర్నరీ సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీ పెంపుడు కుక్క జాతి (Breed) , వయసును బట్టి ఆహార అవసరాలు మారవచ్చు కాబట్టి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Follow Us