తిరుమల శ్రీవారిపై అపారమైన భక్తితో కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల వృద్ధురాలు కుటుంబ సభ్యుల సహాయంతో కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. వయసును లెక్కచేయకుండా మెట్లు ఎక్కిన ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారి భక్తులను ఆకట్టుకుంటున్నాయి.