AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Update: ఆధార్ సెంటర్‌కు వెళ్లే పనిలేదు.. ఇకపై వాటిని ఇంట్లోనే అప్‌డేట్ చేసుకోవచ్చు.. అదికూడా ఫ్రీగా

ఆధార్ వినియోగదారులకు UIDAI భారీ శుభవార్త చెప్పింది. ఆధార్‌తో ఈమెయిల్ లింక్ చేసుకోవడానికి గడువును డీసెంబర్ 31వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఇప్పుడు మీరు ఇంట్లో నుంచి ఆధార్ యాప్‌ ద్వారా ఎలాండి ఛార్జెస్ చెల్లించే పనిలేకుండా ఈమెయిల్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. అదెలానో ఇక్కడ చూద్దాం.

Aadhaar Update: ఆధార్ సెంటర్‌కు వెళ్లే పనిలేదు.. ఇకపై వాటిని ఇంట్లోనే అప్‌డేట్ చేసుకోవచ్చు.. అదికూడా ఫ్రీగా
Free Aadhaar Email Update
Anand T
|

Updated on: Jul 04, 2026 | 6:20 PM

Share

దేశంలో ఉన్న ఆధార్ యూజర్స్‌కు UIDAI అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. అదార్‌తో ఈమెయిల్ ఐడీ లింక్‌ చేసుకోవడానికి గడువును పెంచింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈమెయిల్ అప్‌డేట్‌ చేసుకోవడానికి అవకశం కల్పించింది. అంతేకాదు గతంలో మాదిరి ఎలాంటి ఛార్జెస్ చెల్లించకుండానే ఇప్పుడు మీరు ఈమెయిల్ అప్‌డేట్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. ఆధార్‌లో ఈమెయిల్ ఐడి అప్‌డేట్ చేయడానికి గతంలో రూ. 75 + GST చెల్లించాల్సి వచ్చేది. కానీ తాజాగా జారీ చేసిన ఉత్వర్లు ప్రకారం.. 31 డిసెంబర్ 2026 వరకు మీరు ఎటువంటి రుసుము చెల్లించకుండా ఈమెయిల్ అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఈమెయిల్ అప్‌డేట్ ఎందుకు ముఖ్యం?

ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరికి ఈమెయిల్ చాలా ముఖ్యమైంది. బ్యాంకింగ్ సేవలు, ఇన్సూరెన్స్ , ప్రభుత్వ పథకాలు, ఆన్‌లైన్ వెరిఫికేషన్లలో మనం ఎక్కువగా ఈమెయిల్‌ను వినియోగిస్తూ ఉంటాం. కాబట్టి ఆధార్‌కు ఈమెయిల్ లింగ్ చేసి ఉంటే.. వీటికి సంబంధించిన ముఖ్యమైన నోటిఫికేషన్‌స్, అప్‌డేట్‌లు మీకు సకాలంలో అందుతాయి.

Aadhaar Appలో ఈమెయిల్ అప్‌డేట్ చేసుకోవడం ఎలా?

  • ఫస్ట్‌ మీరు ఫ్లేస్‌స్టోర్‌, లేదా UIDAI అధికారిక Aadhaar App డౌన్‌లోడ్ చేసుకోండి.
  • యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఆధార్ నంబర్‌తో లాగిన్ అయి ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
  • లాగిన్ అయిన తర్వాత Update Email లేదా Update Aadhaar Details ఆప్షన్‌పై క్లిక్ చేయండి
  • అక్కడ మీ కొత్త ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి, అన్ని కరెక్ట్‌గా ఉన్నాయో లేదో సరిచూసుకోండి.
  • ఇప్పుడు రిక్వెస్ట్‌ను సబ్మిట్ చేయండి. కాసేపటికే మీకు ఒక Service Request Number వస్తుంది.
  • దీని సహాయంతో మీరు మీ ఈమెయిల్ అప్‌డేట్ స్టేటస్‌ను ట్రాక్ చేయవచ్చు.
  • జస్ట్ కొన్ని గంటలు లేదా ఒకటి రెండు రోజుల్లో మీ మెయిల్ అప్‌డేట్ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us