AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ENG vs IND 2nd T20I: ఎట్టకేలకు వైభవ్ ఎంట్రీ ఇచ్చేశాడు.. డెబ్యూ క్యాప్ అందించిన తెలుగోడు..

England vs India, 2nd T20I: భారత్, ఇంగ్లాండ్ ఇప్పటివరకు 31 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాయి. వీటిలో భారత్ 18 మ్యాచ్‌లు గెలవగా, ఇంగ్లాండ్ 12 మ్యాచ్‌లు గెలుచుకుంది, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ రెండు జట్లు ఇంగ్లాండ్‌లో 10 మ్యాచ్‌లు ఆడగా, వాటిలో ఇంగ్లాండ్ ఐదింటిలో, భారత్ నాలుగింటిలో గెలుపొందాయి. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

ENG vs IND 2nd T20I: ఎట్టకేలకు వైభవ్ ఎంట్రీ ఇచ్చేశాడు.. డెబ్యూ క్యాప్ అందించిన తెలుగోడు..
Vaibhav Sooryavanshi
Venkata Chari
|

Updated on: Jul 04, 2026 | 6:40 PM

Share

England vs India, 2nd T20I: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని రెండో మ్యాచ్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అలాగే, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఉత్కంఠకు తెరదింపారు. రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు ఈ 15 ఏళ్ల టీమిండియా సెన్సేషన్. తన డెబ్యూ క్యాప్‌ను తిలక్ వర్మ నుంచి అందుకున్న వైభవ్.. ఎట్టకేవలకు రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. మొదటి మ్యాచ్ లాగే, ఈ మ్యాచ్‌లో కూడా వర్షం అంతరాయం కలిగించవచ్చు. వాతావరణ శాఖ ప్రకారం, వర్షం పడే అవకాశం 55% ఉంది. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ కూడా వర్షం కారణంగా డ్రాగా ముగిసింది.

రెండో టీ20 కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ జట్టులోకి తిరిగి రాగా, జోష్ టంగ్ తన టీ20 అరంగేట్రం చేయనున్నాడు. సాకిబ్ మహమూద్, ల్యూక్ వుడ్‌ల స్థానంలో ఈ ఇద్దరు ఆటగాళ్లను తీసుకున్నారు.

ఆధిపత్యం ఎవరిదంటే?

భారత్, ఇంగ్లాండ్ ఇప్పటివరకు 31 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాయి. వీటిలో భారత్ 18 మ్యాచ్‌లు గెలవగా, ఇంగ్లాండ్ 12 మ్యాచ్‌లు గెలుచుకుంది, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ రెండు జట్లు ఇంగ్లాండ్‌లో 10 మ్యాచ్‌లు ఆడగా, వాటిలో ఇంగ్లాండ్ ఐదింటిలో, భారత్ నాలుగింటిలో గెలుపొందాయి. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు తొమ్మిది టీ20 సిరీస్‌లు జరిగాయి. వీటిలో భారత్ ఐదింటిలో, ఇంగ్లండ్ మూడింటిలో విజయం సాధించగా, ఒక సిరీస్ డ్రాగా ముగిసింది. భారత్ వరుసగా గత ఐదు టీ20 సిరీస్‌లలో ఇంగ్లండ్‌ను ఓడించింది.

ఇరు జట్లు:
భారత్ ప్లేయింగ్ XI: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్.

Follow Us