AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఊరట.. ఆన్‌లైన్ సర్వీసులు వచ్చేశాయ్.. కానీ క్లెయిమ్స్ ఆలస్యం..

పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం కొన్ని సర్వీసులు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. రానున్న కొద్ది రోజుల్లో మిగతా సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. మిగతా వివరాల్లోకి వెళ్తే..

Venkatrao Lella
|

Updated on: Jul 04, 2026 | 4:21 PM

Share
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఊరట కలిగింది. గత వారం రోజులకుపైగా నిలిచిపోయిన పీఎఫ్ ఆన్‌లైన్ సేవలు తిరిగి ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. జూన్ 26వ తేదీ నుంచి ఆగిపోగా.. జులై 3 నుంచి తిరిగి పునరుద్దరించారు. అయితే కేవలం కొన్ని సేవలు మాత్రమే ప్రస్తుతం వర్క్ అవుతున్నాయి. పాస్ బుక్ చెకింగ్ వంటి సేవలు ఇంకా ప్రారంభం కాలేదు. ఇందుకు మరికొంత సమయం పడుతుందని, ఖాతాదారులు సహకరించాలని పీఎఫ్ సంస్థ స్పష్టం చేసింది.

1 / 5
త్వరలోనే మిగతా సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. సేవల పంపిణీ, సభ్యుల అనుభవాన్ని మెరుగుపర్చేందుకు డేటాబేస్ ఏకీకరణ, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఈపీఎఫ్ఓ పేర్కొంది. సభ్యులు, యజమానుల సేవలు దశలవారీగా ప్రారంభించబడతాయని తెలిపింది. క్లెయిమ్స్, సర్వీస్ రిక్వెస్ట్‌లు దశలవారీగా ప్రాసెస్ చేస్తామని తెలిపింది. క్లెయిమ్‌లు, కొన్ని సేవల ప్రాసెసింగ్‌కు సాధారణం కంటే కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చని, సభ్యులు, యజమానులు  సహకరించాల్సిందిగా కోరింది.

2 / 5
రద్దీ సమయాల్లో ఆన్‌లైన్ సేవలను పదేపదే యాక్సెస్ చేయడానికి ప్రయత్నించడం లేదా పదేపదే రిక్వెస్ట్‌లు సమర్పించడం వంటివి చేయవద్దని ఈపీఎఫ్ఓ ఓ ప్రకటన జారీ చేసింది. సభ్యులందరి సహనాన్ని, సహకారాన్ని  అభినందిస్తున్నామని, సజావైన, నమ్మకమైన సేవలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది.

3 / 5
కొత్త సాఫ్ట్‌వేర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు మరో రెండు వారాల సమయం పట్టే అవకాశముందని, దీంతో క్లెయిమ్స్ క్లియర్ చేయడానికి నిర్ణీత గడువు కంటే కొంత ఆలస్యమవుతుందని తెలిపింది. ప్రస్తుతం మూడు రోజుల్లో కొన్ని క్లెయిమ్స్ పరిష్కారం అవుతున్నాయి. కానీ రాబోయే రెండు వారాలు క్లెయిమ్ చేసిన నగదు అకౌంట్లో పడటానికి మరికొంత సమయం పట్టే అవకాశముంది.

4 / 5
అయితే ఇప్పుడు పీఎఫ్ వెబ్‌సైట్లో అనేక మార్పులు వచ్చాయి. గతంలో పనిచేసిన సంస్థల నుంచి పొందిన స్కీమ్ సర్టిఫికేట్లను ఆన్‌లైన్‌లో సరెండ్ చేసే ఫీచర్ తీసుకొచ్చింది. ఇక నగదు కోసం క్లెయిమ్ పెట్టుకున్నాక అవసరమైతే క్యాన్సిల్ చేసుకోవచ్చు. గతంలో యూఏఎన్ కార్డుపై ఫొటో వచ్చేది కాదు.. ఇప్పుడు ఫొటో కూడా వస్తుంది.

5 / 5
Follow Us