కాకినాడకు చెందిన సత్తి శివనారాయణ రెడ్డి తన భార్య సత్యవతి అమ్మ మోకాలి నొప్పుల కారణంగా మెట్లు ఎక్కడానికి పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయారు. రెండేళ్ల కృషి తర్వాత, ఇంట్లోనే ఓ అద్భుతమైన మెట్ల లిఫ్ట్‌ను రూపొందించారు. ఇది కేవలం మనుషులకే కాకుండా బరువైన వస్తువులను కూడా మోయగలదు.