AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSRTC : టీజీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఆ బస్సుల్లో పురుషులకు కూడా ఉచిత ప్రయాణం..

హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ట్రాఫిక్‌ ఫ్రీగా సిటీ దాటేందుకు పుష్పక్ ఏసీ ఫీడర్ అనే కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతే కాదు ఈ సర్వీస్ కింద ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. మరీ దీనికి అర్హులు ఎవరు, దాన్ని ఎలా పొందాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

TGSRTC : టీజీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఆ బస్సుల్లో పురుషులకు కూడా ఉచిత ప్రయాణం..
Tgsrtc Free Pushpak Bus
Anand T
|

Updated on: Jul 04, 2026 | 7:15 PM

Share

హైదరాబాద్- బెంగళూరు రూట్‌లో ప్రయాణించే వారికి మరింత మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరు వెళ్లే ప్రయాణికుల కోసం నగర ట్రాఫిక్ ఇబ్బందులను తప్పిస్తూ, సమయాన్ని ఆదా చేసే ఉద్దేశ్యంతో పుష్పక్ ఏసీ ఫీడర్ అనే కొత్త సర్వీలసులను అందుబాటులోకి తెచ్చింది. ఈ సర్వీసుల ద్వారా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది.

సాధారణంగా మియాపూర్, నిజాంపేట్, జేఎన్‌టీయూ, గచ్చిబౌలి, కొండాపూర్, హఫీజ్‌పేట్, లింగంపల్లి, మెహదీపట్నం తదితర ప్రాంతాల నుండి బెంగళూరు వెళ్లే ప్రయాణికులు ముందుగా ఎంజీబీఎస్ చేరుకోవడానికి నగర ట్రాఫిక్ కారణంగా రెండు గంటలకు పైగా సమయం పడుతోంది. ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు సమయం ఆదా చేయడంతో పాటు మరింత సౌకర్యాన్ని అందించేందుకు ఈ ప్రత్యేక సేవలను ప్రారంభించారు.

ఉచిత ప్రయాణ సౌకర్యం ఎవరికి వర్తిస్తుంది?

హైదరాబాద్ – బెంగళూరు సర్వీసులకు రిజర్వేషన్ టికెట్ బుక్ చేసుకునే సమయంలో Shamshabad (Opp. RGIA Traffic P.S.) ను బోర్డింగ్ పాయింట్‌గా ఎంపిక చేసుకుని, సాయంత్రం 6.00 గంటల తర్వాత బయలుదేరే ప్రయాణికులకు మాత్రమే ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం లభిస్తుంది.

ఈ సౌకర్యాన్ని ఎలా వినియోగించుకోవాలి?

బెంగళూరుకు ప్రయాణానికి రిజర్వేషన్ చేసుకునే సమయంలో Shamshabad (Opp. RGIA Traffic P.S.) బోర్డింగ్ పాయింట్‌ను ఎంపిక చేసుకోవాలి. మీరు వెళ్లాల్సిన రోజుతో ఉన్న రిజర్వేషన్ టికెట్‌ చూపించి AC, AJ లేదా AK పుష్పక్ ఎయిర్‌పోర్ట్ లైనర్ ఏసీ సర్వీసుల్లో క్రింది బోర్డింగ్ పాయింట్లలో ఏదైనా ఒక చోటు నుండి Shamshabad (Opp. RGIA Traffic P.S.) వరకు పూర్తిగా ఉచితంగా ప్రయాణించవచ్చు. తర్వాత అక్కడ తమకు రిజర్వేషన్ ఉన్న బెంగళూరు సర్వీసు బస్సు ద్వారా ప్రయాణం సాగించవ్చు.

పుష్పక్ ఫీడర్ బస్సుల రూట్లు, బోర్డింగ్ పాయింట్లు

AC Route (JBS to RGIA): ఈ బస్సులు మీకు జేబీఎస్ (JBS – 9490782330), సికింద్రాబాద్ (9493763149), ప్రకాష్ నగర్, పర్యటక్ భవన్ (8885636522), కేర్ హాస్పిటల్ (బంజారాహిల్స్), NMDC (8885439722), మెహదీపట్నం (9493035592), ఆరాంఘర్ (7382983690) పాయింట్ల వద్ద అందుబాటులో ఉంటాయి.

AJ Route (Miyapur X roads to RGIA): ఈ బస్సులు మియాపూర్ (7382925896), నిజాంపేట్ X రోడ్స్, జేఎన్‌టీయూ (JNTU – 7382324754), మలేషియా టౌన్‌షిప్, శిల్పారామం (8985983467), బయో డైవర్సిటీ, గచ్చిబౌలి ORR (7382925897) ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

AK Route (Lingampally to RGIA):ఈ బస్సులు లింగంపల్లి (7382925896), మదీనాగూడ, ఆల్విన్ X రోడ్స్, హఫీజ్‌పేట్, కొండాపూర్, కొత్తగూడ X రోడ్స్, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి ORR (7382925897)లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

అయితే ఈ ఉచిత ప్రయాణం కేవలం మీరు బెంగళూరు వెళ్లేందుకు టికెట్ రిజర్వేషన్ చేసుకున్న రోజు మాత్రమే వర్తిస్తుంది. హైదరాబాద్ – బెంగళూరు మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు ఈ ప్రత్యేక సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని సమయాన్ని ఆదా చేసుకుంటూ క్షేమంగా, సౌకర్యవంతంగా ప్రయాణించాలని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us