కరోనా కాలంలో.. రైతులకు వాల్‌మార్ట్ అండ..!

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా లాక్‌డౌన్‌ సమయంలో పంటలను విక్రయించుకోవడానికి ఇబ్బంది పడుతున్న గిరిజన రైతులకు వాల్‌మార్ట్‌ ఫౌండేషన్‌ అండగా

కరోనా కాలంలో.. రైతులకు వాల్‌మార్ట్ అండ..!

Walmart foundation supports Tribal farmers: దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా లాక్‌డౌన్‌ సమయంలో పంటలను విక్రయించుకోవడానికి ఇబ్బంది పడుతున్న గిరిజన రైతులకు వాల్‌మార్ట్‌ ఫౌండేషన్‌ అండగా నిలిచింది. చింతపల్లి ఏరియాలో పండించే పసుపు పంటకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా, ఇక్కడ పండే పసుపులో మందుల తయరీకి ఉపయోగించే కర్కుమిన్‌ 5 నుంచి 7 శాతం ఉండటంతో గిరాకీ అధికంగా ఉంటుంది.

కాగా.. లాక్‌డౌన్‌ సమయంలో ఈ పంటను విక్రయించుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతుండటంతో టెక్నో సెర్వ్‌ అనే లాభాపేక్ష లేని సంస్థ సహకారంతో వాల్‌మార్ట్‌ ఫౌండేషన్‌ ఈ పంటలను కొనుగోలు చేసి ఫార్మా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు విక్రయించే విధంగా ఏర్పాట్లు చేసింది. దీని వల్ల 2,500 మంది చిన్న,సన్నకారు రైతులు లబ్ధిపొందినట్లు వాల్‌మార్ట్‌.ఆర్గ్, డైరెక్టర్‌ (స్ట్రాటజిక్‌ ఇనిషియేటివ్స్) షెర్రీ-లీ సింగ్ తెలిపారు.

Read More:

తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. 21 రోజుల్లో ఇంటి అనుమతులు..!

దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ!

Click on your DTH Provider to Add TV9 Telugu