విశాఖకు చెందిన దంపతులకు అరుదైన గుర్తింపు.. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గోనేందుకు అవకాశం

విశాఖకి చెందిన దుర్గ నిర్మించుకున్న ఇ౦టికి జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది.

విశాఖకు చెందిన దంపతులకు అరుదైన గుర్తింపు.. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గోనేందుకు అవకాశం

సొ౦తిళ్లు అనేది ప్రతి ఒక్కరి కళ. అ౦దుకే తమ కుటుంబంకి అవసరమైన ఇల్లు కోసం అవకాశ౦గా వచ్చిన PMAY పథకాన్ని అ౦దిపుచ్చుకుని తన కళల సౌధాన్ని నిర్మించుకున్నారు విశాఖకి చెందిన దుర్గ అనే ఓ సాధారణ గృహిణి. అయితే, ఆమె నిర్మించుకున్న ఇ౦టికి ఇపుడు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. పదిల౦గా కట్టి పదిమంది మెచ్చేలా నిర్మాణం చేపట్టట౦తో శుక్రవారం భారత ప్రధాన మ౦త్రి మోదీతో జరగనున్న వీడియో కాన్ఫరెన్స్‌లో విశాఖ నుండి ఆమె పాల్గొననున్నారు .

విశాఖ గాజువాకలోని ఉప్పరకాలనీకి చెందిన ఎస్.దుర్గ, అప్పన్న బాబు ద౦పతుల కృషికి అపూర్వ గుర్తింపు దక్కింది. ప్రధాన మ౦త్రి ఆవాస్ యోజన పథకం ద్వారా వచ్చిన నగదుకు మరి౦త డబ్బు వెచ్చించి కొద్దిపాటి స్థలంలోనే అన్ని వసతులతో గృహాన్ని నిర్మించుకుని స్పూర్తిగా నిలిచారు. వీరు కట్టుకున్న ఇల్లు PMAY పథకం కింద వచ్చిన నగదుతో కావట౦తో శుక్రవారం ఉదయం జరగనున్న వీడియో సమావేశంలో ప్రధాని నరే౦ద్రమోదీతో దుర్గ విశాఖ నుండి మాట్లాడనున్నారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ అధికారుల నుండి దుర్గకి సమాచారం అందించారు.

విశాఖ గాజువాకలోని ఉప్పరకాలనీకి చెందిన ఎస్. దుర్గ దంపతులు ఇల్లు లేక నానావస్థలు పడ్డారు. వీరు గతంలో ఓ గుడిసెలో నివసి౦చేవారు. ఎండకు, వానకు, చలికి నరకం అనుభవించారు. ఇంటి పైకప్పు ఎ౦తో బలహీన౦గా ఉండేది. ఈ పేదకుటు౦బానికి PMAY పథకంలో భాగంగా రూ.2.50 లక్షలతో ఇల్లు మ౦జూరయింది. ఆ డబ్బు కు మరికొంత జోడించి తక్కువ స్థలంలో అన్ని సౌకర్యాలతో ఇల్లు నిర్మించుకున్నారు. ఇపుదు ద౦పతులు హాయిగా సొంత ఇ౦టిలో జీవిస్తున్నారు. దుర్గ కథ అ౦దరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో ఆమెను ఉత్తమ లబ్ధిదారునిగా ఎ౦పిక చేసి ప్రధాని వీడియో సమావేశానికి అధికారులు ఆహ్వానించారు.