ఆ గడ్డి గేదెలకు వేయవద్దు.. వాటి పాలు తాగవద్దు..

స్టెరీన్ గ్యాస్ లీకేజ్ ఆగింది. వాతావరణంలో స్వచ్ఛమైన ఆక్సిజన్ శాతం పెరిగింది. ఇప్పుడు అంతా హాయిగా గాలి పీలుస్తున్నారు. ఎప్పటిలానే విశాఖపట్నం జిల్లా ఆర్ ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి వెళుతున్నారు ఉద్యోగులు. వారితో పాటు..

ఆ గడ్డి గేదెలకు వేయవద్దు.. వాటి పాలు తాగవద్దు..
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 11, 2020 | 11:13 AM

స్టెరీన్ గ్యాస్ లీకేజ్ ఆగింది. వాతావరణంలో స్వచ్ఛమైన ఆక్సిజన్ శాతం పెరిగింది. ఇప్పుడు అంతా హాయిగా గాలి పీలుస్తున్నారు. ఎప్పటిలానే విశాఖపట్నం జిల్లా ఆర్ ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి వెళుతున్నారు ఉద్యోగులు. వారితో పాటు..నేతలు, అధికారులు అసలేం జరిగిందో ఆరా తీయడం మొదలైంది. అయినా ఏదో తెలియని భయం. ఆ రోజు జరిగిన సంఘటనే ఇటు ఉద్యోగులు, అటు బాధితుల కళ్ల ముందు కదులుతోంది. తమ ఊరే అయినా వారికి అది శత్రువు ప్రాంతంలా కనపడుతోందిప్పుడు. గ్యాస్ కంపెనీ పేరుతో చెబితేనే వారి వెన్నులో వణుకు పుడుతోంది. అమ్మో అనే పరిస్థితి. అసలు ఊపిరాడం లేదు. ఆ రాత్రి ఏం జరిగిందో గుర్తుకు వస్తే చాలు నిద్ర పట్టడం లేదు. ఇప్పుడిప్పుడే ఆసుపత్రిలో కోలుకుంటున్నారు చాలా మంది. అయినా తమ ఊరికి వెళితే అక్కడి నీరు తాగవచ్చా..పండ్లు, ఫలాలు, ఆహార పదార్థాలు తినవచ్చా, పాలు తాగవచ్చా అనే సందేహాలు ముసురుకుంటున్నాయి.

అంతా పాలిమర్ నే…

స్టెరీన్ గ్యాస్ లీకేజ్ వల్ల అక్కడ అంతా పాలిమర్ రూపంలో అణువులు నిక్షిప్తమయ్యాయి. అవి పడ్డ ఏ ఆహార పదార్థం తినరాదనేది నిపుణులు చెబుతున్న మాట. చెరువులు, కుంటలు, బావులు, తటాకాల్లో ఉన్న తాగునీరు పనికి రాదు. ఆకుకూరలు, కూరగాయాలు, పంటలు తినేందుకు అనువుకాదు. కాకపోతే వాటిలో ఎంత మేరకు పాలిమర్ శాతం ఉందనేది పరీక్షలు జరిపాకనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు మరో అనుమానం అక్కడి రైతులను పట్టి పీడిస్తోంది. అదే అక్కడున్న జంతువుల పరిస్థితి ఏంటనేది వారిని వెంటాడుతున్న ప్రశ్న.

పాలు తాగవచ్చా…

గ్యాస్ లీకేజ్ తో ఆవులు, పాలిచ్చే గేదెలు, మేకలు, పొట్టేళ్లు, పశువులు, బల్లులు, ఎలుకలు, పిల్లులు, పాములు, తొండలు, కీటక జాతులకు చెందిన బొద్దింకలు, పురుగులు, పక్షులు చనిపోయాయి. పశువులు అయితే నోటి ద్వారా నురుజులు కక్కుకుంటూ ప్రాణాలు విడిచాయి. 5 వందల వరకు ఫశువులు ఆ గ్రామాల్లో ఉండగా…20కి పైగా పశువులు చనిపోయాయి. మరో 3 వందల పశువుల పై గ్యాస్ ప్రభావం బలంగా పడింది. కొన్నింటికి కాళ్లు పని పని చేయడం లేదు. మరికొన్నింటికి కళ్లల్లో గ్యాస్ పడి చూపు పోయింది. వైద్యులు అహర్నిశలు పని చేస్తు విరుగుడు వాటికి ఇంజెక్షన్లు ఇస్తున్నారు. అయినా ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదు. మరికొద్ది రోజులు వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది. మిగతా జంతుజాలాలు విషగాలి పీల్చి కాళ్లతో కొట్టుకుంటూ ప్రాణ వాయువు వదిలేశాయి. మరికొన్ని ఆ విషవాయువును పీల్చి నిలడ్డాయి. అయితే ఇప్పుడు అక్కడి గడ్డిలోను పాలిమర్ ఉంది. కాబట్టి పశువులకు పచ్చి గడ్డి, ఎండుగడ్డి మేతగా వేయరాదని చెబుతున్నారు పశువైద్యులు.

పచ్చి గడ్డి వద్దు…

అంతే కాదు స్టెరీన్ గ్యాస్ ను పీల్చిన గేదెల నుంచి తీసే పాలను నెల రోజుల వరకు తాగవద్దని హెచ్చరిస్తుండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. పశువులు ఆ గాలి పీల్చడంతో కడుపులో ఇంకా పాలిమర్ నిక్షేపాలు ఉంటాయి. అందుకే వాటి పాలు అసలు తాగవద్దని చెబుతున్నారు వాళ్ళు. అలా తాగితే ఊపిరితిత్తులు, చర్మం పై దద్దుర్లు, తలనొప్పి, వికారం, వాంతులు, ఆయాసం వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అంతే కాదు..పశువులకు అక్కడి గడ్డిని సైతం మేతగా వేయవద్దంటున్నారు వైద్యులు. అక్కడ పెంచుకునే నాటుకోళ్లను తినొద్దట. వాటి శరీరంలోకి విషవాయువు వెళుతుందని..వాటి మాంసం తినడం వల్ల దుష్పప్రభావాలు వస్తాయని చెబుతున్నారు బయో సెంటిస్టులు. మేక, పొట్టేలు వంటి వాటి మాంసాన్ని తినరాదు. ఇందుకు విరుద్దంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో ఇబ్బంది పడక తప్పదు. పశువులకు అక్కడ పంట పొలాల్లో పైరుగా వేసిన జొన్న లేక చొప్ప. పిల్లి పెసర, మొక్కజొన్న వంటి గడ్డి జాతిని గానీ ఎండుగడ్డిని గానీ మేతగా వేయవద్దంటున్నారు పశువుల డాక్టర్లు. మరో ప్రాంతం నుంచి తెప్పించిన చెత్తను మేతగా వేయాలే తప్ప..అక్కడున్న దాన్ని వినియోగించక పోవడం మంచిదంటున్నారు. అదే సమయంలో గడ్డిని వాముగా వేస్తే పై భాగాన్ని తొలగించి..లోపల ఉన్న మేతను వినియోగించవచ్చని సూచిస్తున్నారు.

ముప్పు తప్పదు…

గ్యాస్ ప్రభావానికి గురైన ఆవులు, గేదె పాలల్లో పాలిమర్ ఉంటోంది. వాటిని తాగితే భవిష్యత్ లో ముప్పు తప్పదంటున్నారు. అక్కడి వాతావరణం అంతా పూర్తిగా కలుషితమైంది. పాలిమర్ రూపంలో స్టెరీన్ నిక్షేపాలు సూక్ష్మ ధాతువులుగా ఉండిపోయాయి. మరికొద్ది రోజుల వరకు దాని ప్రభావం ఉంటోంది. పూర్తిగా ఆ ప్రాంతాన్ని స్టెరిలైజ్ చేస్తే తప్ప యధాతథ స్థితికి రాదు. ఇళ్ల పై పెద్ద మొత్తంలో నీరు చల్లడంతో పాటు రసాయానాలతో ఇళ్లను శుద్ది చేస్తేనే అక్కడకు వెళ్లే వీలుంది. అప్పటి వరకు శిబిరాల్లోనే ప్రజలు ఉండాల్సి ఉంది. ఇప్పుడు వారి ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. హడావుడిగా శిబిరాల నుంచి వారిని ఇళ్లకు పంపితే ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని…నిపుణుల కమిటీ నివేదికలు వచ్చాక..వారు చెప్పే దాన్ని బట్టి ఎప్పుడు పంపుతారనేది ఆధారపడి ఉంది. అంతే కాదు..భూమిలో వేసిను పంటల పైనా కొన్నాళ్ల పాటు పాలిమర్ నిక్షేపాల ప్రభావం పడుతోంది. పుట్టే బిడ్డలకు అంగవైకల్యం, అవయవ లోపాలు ఉండే వీలుందని వైద్య నిపుణులు చెబుతున్న మాట.

చోర భయం…

అసలే కరోనా. ఆపై లాక్ డౌన్. పులిమీద పుట్రలా ఇప్పుడు గ్యాస్ లీకేజ్. ఇలాంటి సమయంలో తమ ఇళ్లల్లో దొంగలు పడటం మరింతగా బాధితులను ఆందోళన గురిచేస్తోంది. గ్యాస్ లీకేజ్ తో చాలా మంది తమ ఇళ్లకు తాళాలే కాదు… తలుపులు సరిగా వేయలేదు. ఇంత కంటే మంచి సమయం దొరకదనుకున్న చోరులు ఇళ్లను లూటీ చేస్తున్నారు. ఇటు డబ్బులు, అటు విలువైన ఆభరణాలు, వస్తువులను దోచుకెళుతున్నారు. తమ ఇళ్లల్లో ఎక్కడ దొంగలు పడుతున్నారనే కారణంతో ఊరికి వెళ్లే ఆలోచన చేయవద్దంటున్నారు నిపుణులు. మరోవైపు మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స, కన్నబాబు వంటి వారిది అదే మాటగా ఉంది. అక్కడ ఏదో జరుగుతుందని తొందరపడి ఇంటికి వెళితే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుందంటున్నారు. మరోవైపు ఇప్పుడా ఊళ్లల్లో పోలీసు నిఘాను మరింతగా పెంచారు. అనుమానం ఉన్న వ్యక్తుల కదలికల పై ఆరా తీస్తున్నారు. మీరు నిశ్చింతగా ఉండండి అనేది పోలీసుల మాట. బాధితులంతా తిరిగి తమ గ్రామాలకు ఎప్పుడు వెళ్లాలో అధికారులు చెప్పనుండంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వాళ్లు.

కొండవీటి శివనాగ్ రాజు సీనియర్ జర్నలిస్టు, టీవీ-9.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..