Viral Video: అగ్ని పర్వతం విస్ఫోటనం.. లైవ్ లో చూసేందుకు యువతి సాహసం.. వీడియో వైరల్
ఇండోనేషియా ప్రపంచంలో అత్యధికంగా 130 క్రియాశీల అగ్నిపర్వతాలను కలిగి ఉంది. ఉత్తర మలుకు ప్రావిన్స్‌లో ఉన్న మౌంట్ డుకోనో ఈ అగ్ని పర్వతాలలో ఒకటి. తాజాగా ఈ అగ్ని పర్వతానికి సంబందించిన ఒక వీడియో వైరల్ అయింది. దీనిలో ఒక అమ్మాయి డుకోనో అగ్నిపర్వతం దగ్గర కూర్చున్నట్లు కనిపిస్తుంది. క్లిప్ చూసిన నెటిజన్లు.. ఈ అమ్మాయి చర్య మూర్ఖత్వానికి పరాకాష్ట అని అంటున్నారు.
అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు దాని దగ్గరకు వెళ్లడం ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే అగ్ని పర్వతం నుంచి వెలువడే మండుతున్న లావా, బూడిద, విషవాయువులు నిమిషాల్లోనే ఎవరినైనా చంపేస్తాయి. అయితే ఒక అమ్మాయి బద్దలవుతున్న అగ్నిపర్వతం దగ్గరికి వెళ్లి కూర్చుంటే ఏమవుతుంది? ప్రస్తుతం.. అలాంటి వీడియో ఒకటి ప్రజల దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు ఆ యువతిని మూర్ఖురాలు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి నెటిజన్లకు ఎందుకు అంతగా కోపం వచ్చిందంటే..
వైరల్ వీడియోలో కనిపించిన అమ్మాయిని ఇండోనేషియాకు చెందిన కత్రినా మరియా అనథాసియాగా గుర్తించారు. ఆ యువతికి పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. ఆమె ఇప్పటివరకు చాలా పర్వతాలను అధిరోహించినట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల ద్వారా తెలుస్తోంది. అయితే ఇండోనేషియాలోని ఉత్తర మలుకు ప్రావిన్స్‌లో ఉన్న మౌంట్ డుకోనో అగ్నిపర్వతానికి చాలా దగ్గరగా.. ఇంకా చెప్పాలంటే పర్వతం పైభాగంలో కూర్చున్నట్లు ఓ వీడియో ఒకటి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో చాలా కలకలం సృష్టించింది.
ఈ పర్వతం 1933 నుంచి నిరంతరం విస్ఫోటనం చెందుతోందని మారియా చెప్పారు. దీని ప్రత్యేకత కారణంగా.. చాలా మంది పర్వతాధిరోహకులు ఈ సహజ దృగ్విషయాన్ని దగ్గరగా గమనించడానికి డుక్నో పర్వతం దగ్గరకు వస్తారు. అయితే ఈ ఆరోహణ సమయంలో గైడ్ కూడా ఉండటం అవసరం. ఎందుకంటే ఈ పర్వతం స్వభావం గురించి వారికి మాత్రమే ఖచ్చితమైన సమాచారం ఉంటుంది. ఒక అనుభవజ్ఞుడైన గైడ్ మాత్రమే ఈ పర్వతం మీద గాలి ఎక్కడ ఎంత బలంగా వీస్తుందో.. ఎక్కడికి వెళ్ళితే ఎంత సేఫ్ గా ఉంటారో తెలియజేయగలడు.
ఇక్కడ వీడియో చూడండి
View this post on Instagram
అయితే మరియా వీడియో వైరల్ కావడంతో.. ప్రజలు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. వీడియోలకు వీక్షణలు, లైక్‌లను పొందడం కోసం ప్రజలు ఇలాంటి హాస్యాస్పదమైన విన్యాసాలు చేస్తూ ఇంటర్నెట్ వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు.
మారియా స్పందిస్తూ.. ఈ పర్వతాన్ని ఎక్కడానికి ముందస్తు అనుమతి తీసుకోవాలని.. అనుభవజ్ఞుడైన గైడ్‌తో కలిసి ఉండటం తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటి అని రాసింది. అందువల్ల ముందుగా వాస్తవాలను తనిఖీ చేసి.. ఆపై ఎవరినైనా ట్రోల్ చేయడం మంచిది. దీనితో పాటు పర్వతం పైకి వెళ్లాలని నిర్ణయించుకునే ముందు ఒక రాత్రి గమనించాలని సలహా ఇచ్చింది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..