AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీర్ సీసాతో చపాతీ.. ఇటుకలతో పొయ్యి.. పారతో టిఫిన్ భలే చేసాడుగా.. అదిరిందయ్యా ఐడియా

Viral cooking video: దేశంలో అన్ని చోట్లా గ్యాస్ కొరత ఎక్కువగా కనిపిస్తోంది. గ్యాస్ లేక హాస్టల్లో కూడా టిఫిన్ పెట్టడం మానేశారు. ఇంకొన్ని చోట్ల అయితే, ఒకసారి మాత్రమే ఫుడ్ పెడుతున్నారు. అయితే, ఈ కుర్రాడు మాత్రం గ్యాస్ లేకపోతే ఏంటి నాకు ట్యాలెంట్ ఉందిగా అంటూ కొత్తగా ట్రై చేసాడు.మీరు కూడా చూసేయండి.

బీర్ సీసాతో చపాతీ.. ఇటుకలతో పొయ్యి..  పారతో టిఫిన్ భలే చేసాడుగా.. అదిరిందయ్యా ఐడియా
Viral
Prasanna Yadla
|

Updated on: Mar 14, 2026 | 3:13 PM

Share

ప్రస్తుతం, దేశంలో ఎక్కడ చూసిన గ్యాస్ కొరత ఎక్కువగా కనిపిస్తోంది. గ్యాస్ లేక కొన్ని హాస్టల్లో కూడా టిఫిన్ పెట్టడం మానేశారు. ఇంకొన్ని చోట్ల అయితే, టీ లు మొత్తం బంద్ చేశారు. గ్యాస్ లేక ఎంతో మంది జనాలు రోడ్డు మీదకు వచ్చి సిలిండర్ కోసం నిలబడి క్యూ కడుతున్నారు. అయినా కూడా వారికీ దొరకడం లేదు. ఇక ఇదే సమయంలో చాలా మంది సొంత తెలివితేటలు ఉపయోగించి రక రకాల వస్తువులతో వంటలు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఎప్పుడు ఎదొక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఒక కుర్రాడు మాత్రం గ్యాస్ లేకపోతే ఏంటి నా తెలివి ఉందిగా అంటూ కొత్తగా ట్రై చేసాడు. ముందుగా, అయిపోయిన బీర్ బాటిల్, ఇటుకలు , పార, హీటర్, కుక్కర్ తీసుకుని పక్కన పెట్టుకున్నాడు. గ్యాస్ లేదు, ఏ స్టవ్ కూడా లేదు కానీ, చపాతీలు చాలా ఈజీగా చేసాడు.

బీర్ బాటిల్ తీసుకుని దానితో చపాతీలు చేసాడు. వీటిని కాల్చాలి కదా.. అయితే, దాని కోసం ఇటుకలను తీసుకుని దానికి హోల్స్ పెట్టి కరెంట్ పాస్ అయ్యేలా చేసాడు. మూడు ఇటుక రాళ్లకు కరెంట్ పెట్టి, దాని మీద కలుపు మొక్కలను కట్ చేసే పారను పెట్టి వాటి మీద చపాతీలు భలే కాల్చాడు. మనం ఇన్ని రోజులు చపాతిల కోసం గ్యాస్ వాడాము. కానీ, ఇక్కడ ఆ కుర్రాడు మాత్రం నో గ్యాస్ అంటూ క్షణాల్లో చపాతీలను కాల్చాడు. ఇంకా దానిలోకి కూర కూడా చేసాడు. ఇక దీని కోసం హీటర్ ను వాడి తయారు చేసాడు.

ఈ వీడియోపై నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చూడటానికి చిన్న కుర్రాడి లాగా ఉన్నావ్.. ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది బాబు, అదిరిందయ్యా ఐడియా , కానీ కానీ నీ నుంచి ఇంకా మంచి మంచి వీడియోలు చూడాలి అనుకుంటున్నాం, చూసి నేర్చుకోండయ్యా , మన ఇండియా వాళ్ళకే ఇలాంటి ఐడియాలు వస్తాయని ఇలా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us
బీర్ సీసాతో చపాతీ.. ఇటుకలతో పొయ్యి.. పారతో టిఫిన్ భలే చేసాడుగా
బీర్ సీసాతో చపాతీ.. ఇటుకలతో పొయ్యి.. పారతో టిఫిన్ భలే చేసాడుగా
బాహుబలి సినిమా ఛాన్స్ మిస్సైన హీరోయిన్ ఎవరంటే..
బాహుబలి సినిమా ఛాన్స్ మిస్సైన హీరోయిన్ ఎవరంటే..
జాక్‌పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. ఆశ దోశ అప్పడం వడ..
జాక్‌పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. ఆశ దోశ అప్పడం వడ..
బోరుబావి నుండి నీటి బదులు ఎగసిపడుతున్న మంటలు! షాక్‌లో గ్రామస్తులు
బోరుబావి నుండి నీటి బదులు ఎగసిపడుతున్న మంటలు! షాక్‌లో గ్రామస్తులు
నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో అల్లు అర్జున్ కూతురు..
నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో అల్లు అర్జున్ కూతురు..
రాముడు ప్రతిష్ఠించిన శివ లింగం.. తెలుగు రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే..
రాముడు ప్రతిష్ఠించిన శివ లింగం.. తెలుగు రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే..
పండగ అంటే అందరికీ శుభం.. కానీ వారికి మాత్రం ఉగాది నుంచి వాయింపే
పండగ అంటే అందరికీ శుభం.. కానీ వారికి మాత్రం ఉగాది నుంచి వాయింపే
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
పొయ్యి ముట్టించే పనే లేదు.. అదిరే రోటి పచ్చడి ఇలా రెడీ చేస్కోండి
పొయ్యి ముట్టించే పనే లేదు.. అదిరే రోటి పచ్చడి ఇలా రెడీ చేస్కోండి
సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధం రద్దు!
సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధం రద్దు!