లోకేష్‌పై మళ్ళీ విజయసాయి సెటైర్లు
నారా లోకేష్‌ను మరోసారి టార్గెట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. దేశంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో కూడా లోకేష్‌కు తెలియదంటూ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నారని.. గొలుసులతో కట్టేయాలంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. ‘పప్పు మళ్లీ ఇరుక్కున్నాడు. దేశంలో 900 లోక్ సభ స్థానాలున్నాయంట. మంగళగిరిలో 5 లక్షల మెజారిటీతో గెలిపించాలని కోరినట్లే ఉంది. తండ్రేమో రష్యన్ హ్యాకర్లు ఈవీఎంల ఫలితాలను మారుస్తారని గోల చేస్తున్నారు. ఇద్దరూ రాష్ట్రం పరువు మంట గలుపుతున్నారు. పప్పు, తుప్పులను […]

నారా లోకేష్‌ను మరోసారి టార్గెట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. దేశంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో కూడా లోకేష్‌కు తెలియదంటూ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నారని.. గొలుసులతో కట్టేయాలంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.
‘పప్పు మళ్లీ ఇరుక్కున్నాడు. దేశంలో 900 లోక్ సభ స్థానాలున్నాయంట. మంగళగిరిలో 5 లక్షల మెజారిటీతో గెలిపించాలని కోరినట్లే ఉంది. తండ్రేమో రష్యన్ హ్యాకర్లు ఈవీఎంల ఫలితాలను మారుస్తారని గోల చేస్తున్నారు. ఇద్దరూ రాష్ట్రం పరువు మంట గలుపుతున్నారు. పప్పు, తుప్పులను గొలుసులతో కట్టేయాలేమో?’ అంటూ ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి.
ఇటు లోకేష్ దేశంలో 900 నియోజకవర్గాలు అంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీ కార్యకర్తలు, నెటిజన్లు లోకేష్ వీడియోను ట్రోల్ చేస్తున్నారు. దేశంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో కూడా తెలియదా అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.
పప్పు మళ్లీ ఇరుక్కున్నాడు. దేశంలో 900 లోక్ సభ స్థానాలున్నాయంట. మంగళగిరిలో 5 లక్షల మెజారిటీతో గెలిపించాలని కోరినట్లే ఉంది. తండ్రేమో రష్యన్ హ్యాకర్లు ఈవీఎంల ఫలితాలను మారుస్తారని గోల చేస్తున్నారు. ఇద్దరూ రాష్ట్రం పరువు మంట గలుపుతున్నారు. పప్పు, తుప్పులను గొలుసులతో కట్టేయాలేమో?
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 25, 2019