టాప్ 10 న్యూస్ @ 6 PM
కూటమి అధికారంలోకి వస్తే.. రొటేషన్ ప్రధానులు.. అమిత్ షా ఎద్దేవా బీహార్ ఎన్నికల ప్రచారంలో విపక్ష కూటమిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిప్పులు చెరిగారు. మహాకూటమిలో సరైన నాయకుడే లేడని ఎద్దేవా చేశారు. మహాకూటమి అధికారంలోకి వస్తే.. రోజుకు ఒక్కరు ప్రధానిగా వ్యవహరిస్తారని అన్నారు. ఆంటీల డ్యాన్స్.. ఇరగదీశారు తమ డ్యాన్స్‌లతో ఇప్పటికే పలువురు సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా మారగా.. తాజాగా ఇద్దరు ఆంటీలు చేసిన ఓ డ్యాన్స్ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. 1980లలో […]

- కూటమి అధికారంలోకి వస్తే.. రొటేషన్ ప్రధానులు.. అమిత్ షా ఎద్దేవా
బీహార్ ఎన్నికల ప్రచారంలో విపక్ష కూటమిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిప్పులు చెరిగారు. మహాకూటమిలో సరైన నాయకుడే లేడని ఎద్దేవా చేశారు. మహాకూటమి అధికారంలోకి వస్తే.. రోజుకు ఒక్కరు ప్రధానిగా వ్యవహరిస్తారని అన్నారు.
- ఆంటీల డ్యాన్స్.. ఇరగదీశారు
తమ డ్యాన్స్‌లతో ఇప్పటికే పలువురు సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా మారగా.. తాజాగా ఇద్దరు ఆంటీలు చేసిన ఓ డ్యాన్స్ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. 1980లలో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘ఖుర్బానీ’లో ‘ఆప్ జైసా కోయి’ అనే పాటకు స్టెప్పులు వేస్తూ వారిద్దరు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారారు.
- ఆ హైటెక్ దొంగలు ఏం ఎత్తుకెళ్లారో తెలుసా… ఏకంగా..
ఇప్పటి వరకు బైకులు, కారులు, ఇంకా కాదంటే ట్రక్కులను దొంగతనం చేసిన వార్తలే చూశాం. కానీ ఈ సారి ఓ హైటెక్ దొంగల ముఠా ఏకంగా ప్రభుత్వ ఆర్టీసీ బస్సునే చోరీ చేశారు. హైదరాబాద్‌లోని అఫ్జల్ గంజ్‌లోని సీబీఎస్ బస్టాండ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ నెల 23న రాత్రి 11.00 గంటలకు సీబీఎస్‌లో డ్రైవర్ బస్సును నిలిపి వెళ్లాడు. తెల్లవారిన తరువాత వచ్చి చూస్తే బస్సు కనిపించలేదు.
- ”చెల్లని” హీరో.. శివ కార్తికేయన్ ఓటెక్కడ..?
ఇటీవల దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడులో ఈనెల 18వ తేదీన జరిగిన పోలింగ్‌లో హీరో శివకార్తికేయన్ దంపతులు వలసరవాక్కంలోని ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. శివ కార్తికేయన్ భార్య ఆర్తి పేరు ఓటరు జాబితాలో ఉండగా.. కార్తి కేయన్ పేరు మాత్రం గల్లంతైంది. దీంతో.. ప్రత్యేక అనుమతితో శివకార్తికేయన్ ఓటు వేశారు.
- ప్లాస్టిక్ కు గుడ్‌బై.. ఇది ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ సరికొత్త రికార్డు సృష్టించింది. తొలిసారిగా ప్లాస్టిక్ వాడని విమానాన్ని నడిపి.. ఈ రికార్డు సొంతం చేసుకుంది. ఎర్త్ డే సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆ సంస్థ ఈ విశిష్టమైన నిర్ణయం తీసుకుంది.
- ఐపీఎల్ నుంచి మీరంతా వెళ్ళిపోతే ఎలా..!
ఐపీఎల్ 12వ సీజన్ ను క్రికెట్ అభిమానులందురూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్ల విధ్వంసకరమైన బ్యాటింగ్, సిక్సర్ల మోత, వికెట్లు పడగొట్టడాన్ని టీవీల్లో చూస్తూ కేరింతలు కొడుతున్న అభిమానులకు కాస్త చేదు వార్తే ఇది. వన్డే ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో ఆయా జట్లకు సంబంధించిన కీలక ఆటగాళ్లు తమ దేశాలకు పయనమయ్యారు.
- ‘అర్జున్ సురవరం’కు ‘అవెంజర్స్’ దెబ్బ..!
గత కొంతకాలంగా ‘అర్జున్ సురవరం’ సినిమాను చిత్ర నిర్మాతలు థియేటర్లలోకి తీసుకురావాలని చూస్తున్నా.. సరైన విడుదల తేదీ దొరకట్లేదు. ఇలా పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టికేలకు మే 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. దీనికి అనుగుణంగా హీరో నిఖిల్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాడు. అయితే తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈనెల 26న తెలుగు రాష్ట్రాల్లో అవెంజర్స్ భారీ స్థాయిలో రిలీజ్ అవుతుండడంతో ఈ సినిమాకు అనుకున్న రేంజ్ లో థియేటర్లు దొరకడం లేదట. దాంతో సినిమా విడుదలను వాయిదా వేశారు.
- మా ఢిల్లీ రాష్ట్రం మాకిచ్చేయండి – కేజ్రీవాల్
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. భారతీయ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడమే తమ ఎన్నికల మ్యానిఫెస్టో అని ఆ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలన్న డిమాండ్ కూడా చేశారు.
- ఇక మేమూ మిలిటరీ పోలీసులమే: ఆర్మీలో విమెన్
భారత ఆర్మీలో మొట్టమొదటిసారిగా మహిళలు కూడా జవాన్లతో సమానంగా విధులు నిర్వర్తించనున్నారు. ముఖ్యంగా మిలిటరీ పోలీస్ పేరిట ఏర్పాటు చేసిన విభాగంలో మహిళలను రిక్రూట్ చేసుకోవడానికి ఆర్మీ యాడ్‌ను వార్తాపత్రికల్లో ఇవ్వడం విశేషం. సాయధ దళాల్లో అధికారి హోదాకు తక్కువ స్థాయిలో మహిళలను నియమిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన మూడు నెలల తరువాత సైనికాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
- ప్రియాంకా.. వారణాసి నుంచి పోటీ ఛాన్స్ లేదమ్మా
ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఎక్కడినుంచి పోటీ చేస్తున్నారన్న సస్పెన్స్‌కు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ప్రధాని నరేంద్రమోదీ బరిలోకి దిగిన వారణాసి నియోజకవర్గం నుంచి ఆమె పోటీచేస్తారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తన సోదరుడు రాహుల్ ఆదేశిస్తూ ఈ స్థానం నుంచి తాను పోటీ చేయడానికి సిద్ధమేనని ప్రియాంక కూడా ప్రకటించారు. అయితే ఈ వార్తలకు పుల్‌స్టాప్ పెడుతూ.. తమ పార్టీ తరఫున అజయ్ రాయ్‌ను అభ్యర్థిగా ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం.