విడిది ఖర్చు అక్షరాలా రూ.1.58 కోట్లు

జనవరిలో దావోస్‌లో ‘ప్రపంచ ఆర్థిక సదస్సు’ సమావేశానికి కమల్ నాథ్, ముగ్గురు బ్యూరోక్రాట్లు మధ్యప్రదేశ్ నుంచి హాజరయ్యారు. ఆ రాష్టానికి పెట్టుబడిదారులను ఆకర్షించడానికి వారు అక్కడికి వెళ్లినట్లు ఆ పత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరు కాకపోతే మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాలను కోల్పోయేదని వాటిలో పేర్కొన్నారు. ఎయిర్‌ టికెట్, వీసా, వసతి తదితర ఖర్చులు కలిపి రూ.1,57,85,000కు చేరింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం వెల్లడైంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమకారుడు అజయ్‌ దూబే […]

విడిది ఖర్చు అక్షరాలా రూ.1.58 కోట్లు
Follow us

| Edited By:

Updated on: Apr 25, 2019 | 6:55 PM

జనవరిలో దావోస్‌లో ‘ప్రపంచ ఆర్థిక సదస్సు’ సమావేశానికి కమల్ నాథ్, ముగ్గురు బ్యూరోక్రాట్లు మధ్యప్రదేశ్ నుంచి హాజరయ్యారు. ఆ రాష్టానికి పెట్టుబడిదారులను ఆకర్షించడానికి వారు అక్కడికి వెళ్లినట్లు ఆ పత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరు కాకపోతే మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాలను కోల్పోయేదని వాటిలో పేర్కొన్నారు. ఎయిర్‌ టికెట్, వీసా, వసతి తదితర ఖర్చులు కలిపి రూ.1,57,85,000కు చేరింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం వెల్లడైంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమకారుడు అజయ్‌ దూబే ఈ దరఖాస్తు పెట్టారు. ఆ స్థాయి ఖర్చు పూర్తిగా నివారించదగ్గదని, ప్రజల సొమ్మును మరింత ప్రయోజనకరంగా ఉపయోగించొచ్చని దూబే వెల్లడించారు.