ప్రారంభమైన విజయనిర్మల ‘అంతిమ యాత్ర’

సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల అంత్యక్రియలకు మొయినాబాద్ మండలం చిలుకూరులో ఏర్పాటు చేశారు. నానాక్‌రామ్ గూడలోని ఆమె స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమయ్యింది. కడసారి చూపుకోసం సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్‌లో విజయనిర్మల పార్థీవ దేహానికి అభిమానులు, సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విజయనిర్మల లేని లోటు తీరనిదన్నారు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలుగా తనదైన ముద్రవేసుకున్న నిర్మల ప్రస్థానం తెలుగు సినీలోకానికి ఆదర్శప్రాయమన్నారు. ఆమె ఆత్మకు శాంతి […]

ప్రారంభమైన విజయనిర్మల 'అంతిమ యాత్ర'
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Jun 28, 2019 | 2:26 PM

సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల అంత్యక్రియలకు మొయినాబాద్ మండలం చిలుకూరులో ఏర్పాటు చేశారు. నానాక్‌రామ్ గూడలోని ఆమె స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమయ్యింది. కడసారి చూపుకోసం సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు.

ఫిల్మ్ ఛాంబర్‌లో విజయనిర్మల పార్థీవ దేహానికి అభిమానులు, సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విజయనిర్మల లేని లోటు తీరనిదన్నారు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలుగా తనదైన ముద్రవేసుకున్న నిర్మల ప్రస్థానం తెలుగు సినీలోకానికి ఆదర్శప్రాయమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. కాగా.. నగర శివారులోవున్న చిలుకూరులోని ఫామ్‌హౌస్‌లో విజయనిర్మల అంతిమ సంస్కారాలు చేస్తున్నారు.