ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి కన్నుమూత
ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 1933 అక్టోబర్ 13న ఆమె జన్మించారు. ప్రముఖ రచయిత, విమర్వకుడు, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు అబ్బూరి వరదరాజేశ్వరరావు సతీమణి అయిన ఛాయాదేవి.. ‘బోన్‌సాయ్ బ్రతుకు’, ‘ప్రయాణం సుఖాంతం’, ‘ఆఖరికి ఐదు నక్షత్రాలు’, ‘ఉడ్‌రోజ్’ వంటి కథలను రాశారు. ఆమె రాసిన ‘తన మార్గం’ కథా […]
ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 1933 అక్టోబర్ 13న ఆమె జన్మించారు. ప్రముఖ రచయిత, విమర్వకుడు, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు అబ్బూరి వరదరాజేశ్వరరావు సతీమణి అయిన ఛాయాదేవి.. ‘బోన్‌సాయ్ బ్రతుకు’, ‘ప్రయాణం సుఖాంతం’, ‘ఆఖరికి ఐదు నక్షత్రాలు’, ‘ఉడ్‌రోజ్’ వంటి కథలను రాశారు. ఆమె రాసిన ‘తన మార్గం’ కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అలాగే 2003లో వాసిరెడ్డి రంగనాయకమ్మ ప్రతిభా పురస్కారాన్ని ఆమె అందుకున్నారు.