కోడెల ఫ్యామిలీ చట్టం నుంచి తప్పించుకోలేదు
అమరావతి : ప్రజలు, వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసిన ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుటుంబ సభ్యులెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్ఫష్టం చేశారు. ఆదివారం ఆయన ట్విటర్ వేదికగా కోడెల కుటుంబంపై విమర్శలు గుప్పించారు. కోడెల కుటుంబం ‘కే’ ట్యాక్స్ పేరుతో వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. దీనికి సహకరించిన అధికారులు కూడా దోషులేనని, నిర్బంధ వసూళ్ల మాఫియా అరాచకాలపై దర్యాప్తు […]
అమరావతి : ప్రజలు, వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసిన ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుటుంబ సభ్యులెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్ఫష్టం చేశారు. ఆదివారం ఆయన ట్విటర్ వేదికగా కోడెల కుటుంబంపై విమర్శలు గుప్పించారు. కోడెల కుటుంబం ‘కే’ ట్యాక్స్ పేరుతో వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. దీనికి సహకరించిన అధికారులు కూడా దోషులేనని, నిర్బంధ వసూళ్ల మాఫియా అరాచకాలపై దర్యాప్తు జరుగుతుందన్నారు. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.