AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిచ్చగాడు సీక్వెల్ వచ్చేస్తోంది…

సినిమా ప్రపంచంలోకి సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చి.. సెన్సేష‌న్ క్రియేట్ చేసిన త‌మిళ చిత్రం 'బిచ్చ‌గాడు'. సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఈ చిత్రంతో నటుడు విజయ్ ఆంటోనికి భారీ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఊహకంద‌ని వ‌సూళ్ల‌ను మూటగట్టుకుంది. అమ్మ సెంటిమెంట్...

బిచ్చగాడు సీక్వెల్ వచ్చేస్తోంది...
Sanjay Kasula
|

Updated on: Jul 18, 2020 | 1:43 PM

Share

సినిమా ప్రపంచంలోకి సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చి.. సెన్సేష‌న్ క్రియేట్ చేసిన త‌మిళ చిత్రం ‘బిచ్చ‌గాడు’. సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఈ చిత్రంతో నటుడు విజయ్ ఆంటోనికి భారీ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఊహకంద‌ని వ‌సూళ్ల‌ను మూటగట్టుకుంది. అమ్మ సెంటిమెంట్ ఈ సినిమా రేంజ్‌ను ప‌తాక స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు ఇదే సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతుంది. ఇప్పుడు ఇదే సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతుంది. అందుకోసం నటుడు విజయ్‌నే స్టోరీ రైట‌ర్ గా మారారు.

బిచ్చగాడు సీక్వెల్‌పై ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుండగా ఈ మూవీపై విజయ్ తన ట్విట్టర్‌లో అప్డేట్ ఇచ్చారు. జూలై 24న విజ‌య్ ఆంటోని బ‌ర్త్‌డే కావ‌డంతో ఆ రోజు చిత్ర ఫ‌స్ట్ లుక్‌ను వస్తుందని తెలిపారు. అంతేకాదు సినిమాకి సంబంధించి వివ‌రాలు కూడా వెల్ల‌డిస్తామని తెలిపారు. బిచ్చ‌గాడు చిత్రాన్ని విజయ్ ఆంటోనీ స్వయంగా నిర్మించగా, దర్శకుడు శశి తెరకెక్కించారు. ఇక ఈ మూవీకి సంగీతం కూడా విజయ్ ఆంటోనీ సమకూర్చడం విశేషం. ఇతడు ప్రస్తుతం ‘తమీజరాసన్‌’, ‘అగ్ని సిరగుగాల్‌’, ‘ఖాకీ’ చిత్రాలతో పాటు మరో మూడు సినిమాలలోనూ నటిస్తున్నారు.