దేశంలో క‌రోనా విల‌యం..కొత్త‌గా 34,884 పాజిటివ్​ కేసులు

ఇండియాలో కరోనా వీర‌విహారం చేస్తోంది. కొత్తగా రికార్డు స్థాయిలో 34,884 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మరో 671 మంది కోవిడ్ కార‌ణంగా మరణించారు.

దేశంలో క‌రోనా విల‌యం..కొత్త‌గా 34,884 పాజిటివ్​ కేసులు
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 18, 2020 | 2:22 PM

ఇండియాలో కరోనా వీర‌విహారం చేస్తోంది. కొత్తగా రికార్డు స్థాయిలో 34,884 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మరో 671 మంది కోవిడ్ కార‌ణంగా మరణించారు. కాగా దేశ‌వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,03,8716గా ఉంది. ప్ర‌స్తుతం దేశంలో 3,58,692 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వ్యాధి నుంచి కోలుకుని 6,53,751 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశం మొత్తం కరోనాతో మృతుల సంఖ్య 26273కి చేరుకుంది.

రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే.. మహారాష్ట్రలో క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంది. అక్క‌డ‌ మొత్తం కేసుల సంఖ్య 2,92,589కి చేరింది. 11,452 మంది వైర‌స్ కారణంగా చ‌నిపోయారు. తమిళనాడులో కోవిడ్-19 కేసులు 1,60,907కి చేరాయి. 2,315 మంది వైర‌స్ కు బ‌ల‌య్యారు. ఢిల్లీలో కొవిడ్​ బాధితుల సంఖ్య 1,20,107గా ఉంది. మొత్తంగా 3,571 మంది ప్రాణ‌లు విడిచారు. గుజరాత్​లో మొత్తంగా 46,430 మందికి కరోనా సోక‌గా.. 2,106 మంది వ్యాధితో పోరాడ‌లేక‌ చనిపోయారు.