AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుమారం రేపుతున్న సాధ్వీ ప్రాచి వ్యాఖ్యలు.. మసీదులో హోమం చేస్తామన్న సాధ్వీ

విశ్వ హిందూ పరిషత్ నాయకురాలు సాధ్వీ ప్రాచి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలోని ఒక మసీదులో హోమం చేస్తామని శుక్రవారం నాడు వాఖ్యానించారు.

దుమారం రేపుతున్న సాధ్వీ ప్రాచి వ్యాఖ్యలు.. మసీదులో హోమం చేస్తామన్న సాధ్వీ
Balaraju Goud
|

Updated on: Nov 07, 2020 | 6:06 PM

Share

విశ్వ హిందూ పరిషత్ నాయకురాలు సాధ్వీ ప్రాచి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలోని ఒక మసీదులో హోమం చేస్తామని శుక్రవారం నాడు వాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ మధురాలోని ఒక ఆలయంలో నమాజ్ సమర్పించినందుకు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన కొన్ని రోజుల తరువాత ఆమె ఇలా బహిరంగంగా ప్రకటించడం తీవ్ర కలకలం రేపింది. అయితే, వెంటనే ఆమె తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. సాధ్వీ ప్రాచి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మరోసారి దుమారం రేపుతున్నాయి.

ఇదిలావుంటే, అక్టోబర్ 29వ తేదీన మధురలోని నందగావ్‌లో ఉన్న నంద్ బాబా మందిర్ వద్ద ఇద్దరు వ్యక్తులు నమాజ్‌ చేశారనే ఆరోపణలతో పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు నమోదు చేశారు. ఫైజల్ ఖాన్‌, చంద్ మొహమ్మద్ అనే వ్యక్తులు నమాజ్‌ చేయగా వారితో పాటు వచ్చిన అలోక్ రతన్, నీలేష్ గుప్తా వారి ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసినట్లు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన తరువాత, మసీదులలో పలువురు ‘హనుమాన్ చలీసా’ చదివడంతో వారిపై కూడా పోలీసులు కేసులు పెట్టారు. తారోలి గ్రామంలోని ఒక మసీదులోకి ప్రవేశించి హనుమాన్ చలీసాను పఠించినట్లు ఆరోపణలు రావడంతో మధుర పోలీసులు గురువారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిపై సీఆర్‌పీసీ 151 కింద కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో సాధ్వీ ప్రాచి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక ప్రాచి ఈ విషయాల పై స్పందిస్తూ సామాజిక సామరస్యం పేరిట ఒక ముఠా దేవాలయాలకు వెళ్లి నమాజ్ చేస్తోందని, సాంఘిక సామరస్యాన్ని కాపాడుకునేలా హిందువులు కూడా మసీదుల వద్దకు వెళ్లి హోమం చేయాలని తాము అభిప్రాయపడుతున్నామని ఆమె పేర్కొన్నారు. దేవాలయాలను నాశనం చేసి నిర్మించిన మసీదులను కూల్చివేసి అక్కడ పూజలు నిర్వహించాలన్నారు. హోమం చేయడం ద్వారా వాయు కాలుష్యం కూడా తగ్గుతుందన్నారు. లక్నోలో ఉన్న పురాతన మసీదలో హోమం చేస్తామని ఆమె ప్రకటించారు. అయితే, తరువాత ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. దీంతో పాటు ఆమె ‘లవ్‌ జిహాద్‌’ పై కూడా స్పందించారు. ఇది ఎంతోకాలంగా చేస్తోన్న కుట్ర అని ఇది నెమ్మదిగా భారతదేశమంతా విస్తరిస్తుందన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులను బహిరంగా ఉరితీయాలని ప్రాచి డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని తీసుకురావాలన్నారు.

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా