AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Sleeper: ఆరంభం అదిరింది.. కానీ తర్వాత ఇలా! వందే భారత్‌ స్లీపర్‌ రైలులో ఫుడ్‌పై విమర్శలు

వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని ప్రారంభించగా, మొదట ఆహారాన్ని ప్రయాణికులు మెచ్చుకున్నారు. అయితే, కొద్ది రోజులకే ఆహార నాణ్యత, పరిమాణంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రారంభ రోజు అందించిన భోజనానికి, ఆ తర్వాత అందిస్తున్న భోజనానికి స్పష్టమైన తేడాలున్నాయని ఫొటోలు వైరల్ అయ్యాయి.

Vande Bharat Sleeper: ఆరంభం అదిరింది.. కానీ తర్వాత ఇలా! వందే భారత్‌ స్లీపర్‌ రైలులో ఫుడ్‌పై విమర్శలు
Vande Bharat Sleeper Food
SN Pasha
|

Updated on: Jan 26, 2026 | 7:03 PM

Share

ఇండియన్‌ రైల్వేస్‌కే గర్వకారణంగా నిలిచేలా వందే భారత్‌ స్లీపర్‌ రైలును రూపొందించారు. ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును అట్టహాసంగా ఆరంభించారు. అయితే ఆరంభమై వారం కూడా కాలేదు అంతలోనే ఈ రైలులో ఓ విషయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైలులో అందించే ఆహారం నాణ్యత, పరిమాణం గురించి ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామాఖ్య-హౌరా వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను శనివారం ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. రాత్రిపూట ప్రయాణం కోసం రూపొందించబడిన ఈ రైలు అస్సాంలోని కామాఖ్యను పశ్చిమ బెంగాల్‌లోని హౌరా మధ్య నడుస్తుంది.

ఈ కొత్త వందే భారత్‌ స్లీపర్‌ రైలు జనవరి 17న ప్రారంభం అయినప్పటికీ దాని కమర్షియల్‌ జర్నీ జనవరి 22న ప్రారంభించింది. ఆరంభం రోజు రైలు ఇంటీరియర్‌, లగ్జరీ లుక్‌, అందులో ఇచ్చే బ్లాంకెట్‌లు, అందించే ఆహారం అన్నీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అన్నీ నెక్ట్స్‌ లెవెల్‌లో ఉన్నాయంటూ ప్రయాణికులంతా వాటిని మెచ్చుకున్నారు. కానీ, ఇప్పుడు అదే రైలులో అందించే ఫుడ్‌పై పెదవివిరుస్తున్నారు. ఉదయ్ ఛటర్జీ అనే యూజర్ తాజాగా ఓ పోస్ట్‌ చేశాడు. అందులో వందే భారత్ స్లీపర్‌లో వడ్డించే భోజనాలకు సంబంధించి రెండు ఫొటోలు ఉన్నాయి.

మొదటి ఫొటోలో వందే భారత్‌ స్లీపర్‌ ప్రారంభోత్సవం రోజు ప్రయాణికులకు అందించింది. దాని పక్కన ఉన్న ఫొటో 22 నుంచి అందిస్తున్న భోజనానికి సంబంధించింది. రెండింటి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి రోజు హడావిడి చేసి తర్వాత అసలు రంగు బయటపెట్టారంటూ నెటిజన్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. మొదటి రోజు థాలీలో బియ్యం, పరాఠా, పనీర్ వంటకం, కూరగాయల వంటకం, పప్పు, డెజర్ట్, ఊరగాయ ఉన్నాయి. పెరుగు విడిగా వడ్డించారు. తర్వాత నుంచి అందులో చాలా ఐటమ్స్‌ మిస్‌ అవుతున్నాయి. పైగా ప్యాకింగ్‌లో కూడా తేడా ఉంది. ఈ ఫొటోలు ఆహార నాణ్యత గురించి చర్చకు దారితీశాయి. కొంతమంది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)పై విమర్శలు గుప్పించారు.

స్పందించిన IRCTC

కాగా ఈ ఆరోపణలను IRCTC తోసిపుచ్చింది. వైరల్ పోస్ట్‌పై స్పందిస్తూ, IRCTC అధికారిక X హ్యాండిల్ ఆహార పరిమాణం, నాణ్యతలో ఎటువంటి తేడా లేదని పేర్కొంది. ప్రఖ్యాత క్యాటరింగ్ కంపెనీ ద్వారా భోజనం అందిస్తున్నట్లు తెలిపింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి