వేదాద్రి ప్రమాదం: మృతులకు రూ.5లక్షల పరిహారం..తెలంగాణ వారికి సైతం…
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ప్రమాదవశాత్తూ లారీ, ట్రాక్టర్ ఢీకొనడంతో 12 మంది ప్రాణాలు విడిచారు. కాగా చనిపోయిన వారికి ఏపి సీఎం జగన్ 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ప్రమాదవశాత్తూ లారీ, ట్రాక్టర్ ఢీకొనడంతో 12 మంది ప్రాణాలు విడిచారు. కాగా చనిపోయిన వారికి ఏపి సీఎం జగన్ 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం డబ్బును అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన తెలంగాణ వారికి సైతం ఎక్స్‌గ్రేషియా అందజేయాలని సీఎం సూచించారు. రాష్ట్ర భూభాగం పరిధిలోనే ప్రమాదం జరిగినందున మానవతా దృక్పథంతో మృతుల కుటుంబాలను ఆదుకోవాలని సీఎం అధికారులకు చెప్పారు. కాగా తెలంగాణ ప్రభుత్వం కూడా వేదాద్రి రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు 2 లక్షలు నష్టపరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్ ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. చనిపోయినవారికి నష్టపరిహారం అందజేయడంతో పాటు..గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
కాగా, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి వద్ద బుధవారం భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వేగంగా వచ్చిన బొగ్గు లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, ఖమ్మం జిల్లా మధిర మండలం గోపవరంకు చెందిన 9 మంది ప్రాణాలు విడిచారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం సేవించి లారీని నడపడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.




