బ్రేకింగ్: ఓటీటీలో విడుద‌ల కానున్న `వి` సినిమా

నేచుర‌ల్ స్టార్‌ నాని, సుధీర్ బాబులు క‌లిసి న‌టించిన ''వి'' సినిమా ఓటీటీలో విడుద‌ల కాబోతుంది. ఇందుకు సంబంధించి సెన్సేష‌న‌ల్ ట్వీట్ చేశాడు నాని. ''థియేట‌ర్ ఎక్స్ పీరియ‌న్స్ ఇంట్లో అంటూ'' హీరో నాని అనౌన్స్ మెంట్ చేశారు. వి చిత్రానికి సంబంధించి..

బ్రేకింగ్: ఓటీటీలో విడుద‌ల కానున్న `వి` సినిమా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 19, 2020 | 7:30 PM

నేచుర‌ల్ స్టార్‌ నాని, సుధీర్ బాబులు క‌లిసి న‌టించిన ”వి” సినిమా ఓటీటీలో విడుద‌ల కాబోతుంది. ఇందుకు సంబంధించి సెన్సేష‌న‌ల్ ట్వీట్ చేశాడు నాని. ”థియేట‌ర్ ఎక్స్ పీరియ‌న్స్ ఇంట్లో అంటూ” హీరో నాని అనౌన్స్ మెంట్ చేశారు. వి చిత్రానికి సంబంధించి గురువారం కీల‌క ప్ర‌క‌టన చేయ‌బోతోంది వి సినిమా చిత్ర బృందం. ”లాక్‌డౌన్ టైమ్‌లో రిలీజుల హ‌డావిడిని మిస్ అయ్యానంటూ పేర్కొన్నాడు నాని. నాని కెరీర్‌లో `వి` 25వ సినిమా. ఓటీటీలో విడుద‌ల కానున్న తొలి తెలుగు భారీ చిత్రం ఇదే!”. కాగా సెప్టెంబ‌ర్ 5న ఓటీటీలో `వి` మూవీ విడుద‌ల కానున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా.. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ‘వి’ సినిమాలో సుధీర్‌బాబు, నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Also Read: 

Kushboo Eye Injury : ప్ర‌ముఖ న‌టి కుష్బూ కంటికి గాయం

మెట్రో ఉద్యోగుల జీతభ‌త్యాల్లో 50 శాతం కోత‌

న‌టి శివ పార్వ‌తికి క‌రోనా పాజిటివ్.. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదంటూ ఆవేద‌న‌!