ఓ మర్డరర్..పోలీసుగా 19 ఏళ్లు పనిచేశాడు..

ఒక హత్య నిందితుడు ఉత్తరాఖండ్‌లోని పోలీసు బలగాలలో చేరగలిగాడు. అదే శాఖలో కానిస్టేబుల్‌గా వివిధ ప్రదేశాలలో సర్వీస్ చేశాడు. 19 సంవత్సరాలుగా తన పై అధికారులను మోసగించాడు.  వివరాల్లోకి వెళ్తే..  ఉత్తరాఖండ్ పోలీసులలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ముఖేష్ 1997 లో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. పోలీసులు ఎంత వెతికినా కనిపించలేదు.  అయితే, నేరం జరిగిన నాలుగేళ్ల తర్వాత 2001 లో ఆయన రాష్ట్ర పోలీసుల్లో నియామకానికి […]

ఓ మర్డరర్..పోలీసుగా 19 ఏళ్లు పనిచేశాడు..

ఒక హత్య నిందితుడు ఉత్తరాఖండ్‌లోని పోలీసు బలగాలలో చేరగలిగాడు. అదే శాఖలో కానిస్టేబుల్‌గా వివిధ ప్రదేశాలలో సర్వీస్ చేశాడు. 19 సంవత్సరాలుగా తన పై అధికారులను మోసగించాడు.  వివరాల్లోకి వెళ్తే..  ఉత్తరాఖండ్ పోలీసులలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ముఖేష్ 1997 లో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. పోలీసులు ఎంత వెతికినా కనిపించలేదు.  అయితే, నేరం జరిగిన నాలుగేళ్ల తర్వాత 2001 లో ఆయన రాష్ట్ర పోలీసుల్లో నియామకానికి దరఖాస్తు చేసుకున్నాడు. సర్టిఫికెట్లలో అడ్రస్‌తో పాటు అన్ని డిటేల్స్ మార్చేయడంతో..ఉన్నతాధికారులు అతడి క్రిమినల్ బ్యాగ్రౌండ్ గుర్తించలేకపోయారు. ప్రస్తుతం అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిని అల్మోరాలో పోస్ట్ చేశారు, దర్యాప్తు పూర్తయిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని ఎస్‌హెచ్‌ఓ అశోక్ కుమార్ తెలిపారు. ముఖేష్ కుమార్‌పై ఐపిసి సెక్షన్ 420 కింద పంత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.  

Published On - 10:33 am, Tue, 4 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu