పొలంలో రెండు పైథాన్లు, అయినా పట్టేశారు !
ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ జిల్లా గౌల్పార్ గ్రామంలో తమ పొలంలో పని చేసుకుంటున్న రైతులు భయంతో పరుగులు తీశారు. వారికి రెండు భారీ కొండచిలువలు కనబడడమే ఇందుకు కారణం..
ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ జిల్లా గౌల్పార్ గ్రామంలో తమ పొలంలో పని చేసుకుంటున్న రైతులు భయంతో పరుగులు తీశారు. వారికి రెండు భారీ కొండచిలువలు కనబడడమే ఇందుకు కారణం. వీటిని చూసిన వారు వెంటనే అటవీ శాఖకు సమాచారమందించారు. ఆ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు వఛ్చి అతి కష్టమ్మీద వీటిని పట్టుకున్నారు.10 నుంచి 12 అడుగుల పొడవున్న ఈ భారీ పైథాన్లను వారు అడవిలో వదిలిపెట్టారు. వర్షాకాల సీజన్ లో ఇలాంటి భయంకర సర్పాలు తమ పొలంలో కనబడుతుంటాయని రైతులు తెలిపారు. అటవీ శాఖ సిబ్బంది పట్టుకున్న కొండచిలువల్లో ఒకటి ఒక పట్టాన ‘లొంగలేదు’. సదరు ఉద్యోగిని ముప్పుతిప్పలు పెట్టింది. అతడిని చుట్టేయడానికి ప్రయత్నించింది. కానీ ఆయన నేర్పుగా దాన్ని ఒడిసి పట్టుకోగలిగాడు.
#WATCH Uttarakhand: Two pythons rescued from Gaulapar area in Haldwani yesterday by Forest Department’s Quick Response Team. pic.twitter.com/0bwQmeX3ZK
— ANI (@ANI) August 25, 2020