సెల్‌ఫోన్ బ్యాటరీ స్థానంలో బంగారం బిస్కెట్.. స్మగ్లర్ అరెస్ట్

ఢిల్లీ విమానాశ్రయయంలో ఇలాంటి కొత్త తరహా మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. 505 గ్రాముల బంగారాన్ని ఓ ప్రబుద్ధుడు సెల్‌ఫోన్ ద్వారా అక్రమంగా తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

సెల్‌ఫోన్ బ్యాటరీ స్థానంలో బంగారం బిస్కెట్.. స్మగ్లర్ అరెస్ట్
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 25, 2020 | 5:22 PM

బంగారం అక్రమ రవాణాకు స్మగ్లర్లు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి బంగారాన్ని తరలించేందుకు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. తాజాగా ఢిల్లీ విమానాశ్రయయంలో ఇలాంటి కొత్త తరహా మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. 505 గ్రాముల బంగారాన్ని ఓ ప్రబుద్ధుడు సెల్‌ఫోన్ ద్వారా అక్రమంగా తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. సెల్‌ఫోన్ బ్యాటరీ స్థానంలో బంగారం బిస్కెట్ పెట్టి స్మగ్లింగ్ చేస్తున్న తీరును చూసి అధికారులు.. కొత్త తరహా మోసాన్ని చూసి విస్మయం వ్యక్తంచేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి ఈ బ్యాటరీ బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. ఎలాంటి బిల్లులూ లేకుండా అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండడంతో సీజ్ చేశామని ఢిల్లీ డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.