టెస్టుల కోసం వచ్చి కుప్పకూలిన వృద్ధుడు మృతి….కరోనా భయంతో ఇలా..
కరోనా మహమ్మారి మనుషుల్లోని మానవత్వాన్ని తుంచేస్తోంది. తోటి వారు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ సాయం చేసేందుకు ఎవరూ దగ్గరకు రాకుండా చేస్తోంది.
కరోనా మహమ్మారి మనుషుల్లోని మానవత్వాన్ని తుంచేస్తోంది. తోటి వారు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ సాయం చేసేందుకు ఎవరూ దగ్గరకు రాకుండా చేస్తోంది. ప్రతినిత్యం ఏదో ఒకచోట ఇటువంటి అమానవీయ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
మంచిర్యాల జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పాత మంచిర్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఓ వృద్దుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అనంతరం అక్కడే ప్రాణాలు విడిచాడు. కానీ, వెంటాడుతున్న కరోనా భయంతో అక్కడున్న వారేవరు ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లేందుకు సాహసించలేదు. దీంతో కొన్ని గంటల పాటు ఆ మృతదేహం అక్కడే పడి ఉంది. ఎట్టకేలకు సమాచారం అందుకున్న మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది అక్కడకు చేరుకుని మృతదేహన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, మరోవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది టెస్టులను నిలిపివేశారంటూ అక్కడి స్థానికులు ఆందోళనకు దిగారు.