కరోనా వైరస్‌తో ఆర్మీ జవాను మృతి

ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన ఆర్మీ ఉద్యోగి కరోనా వైరస్‌తో మృతి చెందాడు. కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న పలుగుంటి పల్లెకి చెందిన జవాన్.. కరోనాతో విధి నిర్వహణలోనే మృతి చెందినట్లు కుటుంబానికి సమచారం అందించారు ఆర్మీ అధికారులు. కాగా సైనిక లాంఛనాలతో...

కరోనా వైరస్‌తో ఆర్మీ జవాను మృతి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 25, 2020 | 5:44 PM

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసుల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానానికి చేరుకుంది భారత్. కాగా ఇది వరకే భారత ఆర్మీ‌లో కూడా పలువురు జవాన్లు ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే తాజాగా ఓ ఆర్మీ జవాన్ కోవిడ్‌తో మృతి చెందాడు.

ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన ఆర్మీ ఉద్యోగి కరోనా వైరస్‌తో మృతి చెందాడు. కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న పలుగుంటి పల్లెకి చెందిన జవాన్.. కరోనాతో విధి నిర్వహణలోనే మృతి చెందినట్లు కుటుంబానికి సమచారం అందించారు ఆర్మీ అధికారులు. కాగా సైనిక లాంఛనాలతో జమ్మూకశ్మీర్‌లోనే జవానుకు అంత్యక్రియలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Read More:

సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కాలేజీల్లో ఆన్‌లైన్‌ క్లాసులు

తెలంగాణలో కరోనా వైరస్ అదుపులోనే ఉంది

కోవిడ్ భయంతో కాంగ్రెస్ నేత ఆత్మహత్య

వినూత్న ప్రయోగం.. వాట్సాప్‌లో గణేష్ లడ్డూ వేలం

బిగ్‌బాస్-4 ఎంట్రీపై నటుడు నందు క్లారిటీ