సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కాలేజీల్లో ఆన్‌లైన్ క్లాసులు
తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కాలేజీల్లో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27 నుంచి విధులకు హాజరు కావాలని లెక్చరర్లకు ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దూరదర్మన్, టీ-శాట్ ద్వారా..
తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కాలేజీల్లో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27 నుంచి విధులకు హాజరు కావాలని లెక్చరర్లకు ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దూరదర్మన్, టీ-శాట్ ద్వారా డిజిటల్ క్లాసులు మొదలు కానున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. మరో ఐదు రోజుల్లో ఆన్‌లైన్ క్లాసులకు అంతా సిద్ధం చేసుకోవాలని సూచించింది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం డిగ్రీ, పీజీ పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Read More:
తెలంగాణలో కరోనా వైరస్ అదుపులోనే ఉంది
కోవిడ్ భయంతో కాంగ్రెస్ నేత ఆత్మహత్య