మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారానికి పాలుపడ్డ ఇన్స్‌పెక్టర్.. పరారీలో నిందితుడు
మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారానికి పాలుపడ్డ కేసులో ఓ ఇన్స్‌పెక్టర్ సస్పెండ్ కు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో చోటుచేసుకుంది.
మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారానికి పాలుపడ్డ కేసులో ఓ ఇన్స్‌పెక్టర్ సస్పెండ్ కు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో చోటుచేసుకుంది. అలీఘర్‌కు చెందిన రాకేశ్ యాదవ్ అనే ఇన్స్‌పెక్టర్ ఓ కేసు కు సంబందించిన ఫైల్ తీసుకొని తానున్న హోటల్ కు రమ్మని మహిళా కానిస్టేబుల్ ను ఆదేశించాడు. ఫైల్ తీసుకొని హోటల్ కు వెళ్లిన ఆమె పై అత్యాచారానికి పాలుపడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపుతానని బెదిరించాడు. దాంతో ఆమె విషయం బయటపెట్టకుండా ఉండిపోయింది. ఆమె భయాన్ని అలుసుగా తీసుకున్న రాకేశ్ యాదవ్ ఆమెకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. దాంతో ఓపిక నశించిన బాధితురాలు జిల్లా ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు యాదవ్ పై కేసునమోదు చేసారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. రాకేష్ యాదవ్ ను సస్పెండ్ చేస్తూ..జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీచేశారు.