AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీలో కొత్తగా 500 పాజిటివ్ కేసులు

ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా 500కు పైగా కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటన. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,733కు చేరింది.

యూపీలో కొత్తగా 500 పాజిటివ్ కేసులు
Balaraju Goud
|

Updated on: Jun 05, 2020 | 8:05 PM

Share

కరోనా వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్న కొవిడ్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వలస కార్మికులు స్వస్థలాలకు రావడంతో మరిన్ని కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా 500కు పైగా కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 502 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 12 మంది మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,733కు చేరింది. 257 మంది మరణించారు ఇప్పటివరకు 5,648 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 3,828 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Follow Us